"జైలర్" లో ఆ సీన్ ని మార్చిన రజినీ.. కట్ చేస్తే థియేటర్స్ లో హిట్, సోషల్ మీడియాలో ట్రెండ్.. ఆ సీన్ ఏదంటే
సినిమాల్లో మల్టీ టాలెంట్ కలిగిన ఆర్టిస్ట్ లు టెక్నీషియన్స్ వంటి వారు చాలా మందే ఉంటారు. అయితే ఈ తరహాలో ఎక్కువగా మన సౌత్ ఇండియా సినిమా నుంచే చాలా మంది కనిపిస్తారు. కాగా కొందరు హీరోలు అయితే కథలు కూడా తమ సినిమాలు రాకుంటుంటే మరికొందరు పలు సినిమాలు దర్శకత్వం కూడా వహిస్తారు. అలా రీసెంట్ గా తమిళ్ సినిమా నుంచి ధనుష్ నటించి దర్శకత్వం వహించిన రాయన్ వస్తే..
ఇటీవల కన్నడ నుంచి రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' కూడా వచ్చింది. ఈ చిత్రానికి ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే వీరు యువ హీరోలు.. కానీ మన సీనియర్ హీరోలు కూడా తమ సినిమాల్లో చేసే చిన్న చిన్న మార్పులు ఎంతో ప్రభావం చూపిస్తాయి. మెయిన్ గా కోలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోస్ లో అయితే ఉలగనయగన్ కమల్ హాసన్ ఎన్నో చిత్రాలకి యూనిక్ కథలు రచించారు.

అలాగే తనతో పాటుగా తన టైం నుంచే ఉన్న మరో బిగ్ స్టార్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా పలు చిత్రాలు తన కథతో చేయడం కానీ కొన్ని సూచనలు ఇవ్వడం కానీ చేసినవి ఉన్నాయి. అలా ఇప్పుడు తాను చేసిన "జైలర్" లో ఒక ఆసక్తికర సన్నివేశాన్ని తాను పూర్తిగా మార్చిన సంగతి వైరల్ గా మారింది. ఈ సినిమాని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మంచి మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడు.
కానీ ఈ సినిమాలో కీలకమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కనిపిస్తాయి. మెయిన్ గా తండ్రీకొడుకుల బంధానికి సంబంధించి క్లైమాక్స్ లో ఒక సీన్ హైలైట్ గా నిలిచింది.. తన కొడుకు పుట్టిన నాటి నుంచి తన లానే ఎంతో నిజాయితీగా కొడుకును పెంచాను అనుకోని రజిని రోల్ అనుకుంటుంది కానీ తన కొడుకు నీచుడు, అవినీతి పరుడు అనే షాకింగ్ ట్విస్ట్ రజినీకి తెలుస్తుంది.

ఇది చాలా కీలకమైన ఎమోషనల్ సన్నివేశం. అయితే ఈ సీన్ ని నెల్సన్ ఒకలా డిజైన్ చేస్తే రజినికాంత్ మరోలా మొత్తం మార్చేశారట. తన కొడుకు అసలు రూపం తెలుసుకున్న తండ్రి అక్కడ చాలా భావోద్వేగానికి లోనయ్యి కన్నీళ్లు పెట్టుకొని వేదనకి గురైనట్టుగా నెల్సన్ ఆ సీన్ ని మొదట చెప్పాడట. కానీ దానిని రజినీకాంత్ మనం సినిమాలో చూసిన సీన్ తన కొడుకు కోసం తెలిసి బాధలోనే నవ్వుతూ.. కనిపించేలా మార్చేసారట.
ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అని రజిని తెలిపారట. మరి రజినీ చెప్పడం అది జరగకపోవడమా? సీన్ కట్ చేస్తే థియేటర్స్ లో ఆ ఎపిసోడ్ పెద్ద హిట్ అయ్యింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ ఆ సీన్ తో మీమ్స్ కూడా పడుతూ ఉంటాయి.. సో ఇలా రజినీకాంత్ అయితే ఆ సీన్ ని మార్చడం జరిగింది. కాగా రజిని ఆ సీన్ ని మారిస్తే అనిరుద్ కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడని చెప్పాలి. మరి ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ లు సాలిడ్ గెస్ట్ రోల్స్ లో నటించగా రానున్న రోజుల్లో "జైలర్ 2" ని కూడా నెల్సన్ సిద్ధం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











