హరిహర వీరమల్లు టీజర్‌లో ఈ షాట్ గమనించారా? 24 ఏళ్ల తర్వాత కూడా పవన్ ఖుషీలో లాగానే!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ మూవీ ''హరిహరవీరమల్లు''. స్టార్ ప్రొడ్యూసర్ ఏం రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లిన ఈ మూవీ అనివార్య కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలించిన కాలంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనున్నారు మేకర్స్ . ఇందులో పవన్ బందిపోటుగా కనపించనున్నారు. అంటే పెత్తందారులను కొట్టి.. పేదలకు పంచే రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ అన్నమాట.

ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికలతో బిజీగా వున్నారు. కూటమి అభ్యర్ధుల తరపున రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతూ వుండటంతో ఇప్పట్లో సినిమాల వంక కన్నెత్తి చూడటం కూడా కష్టమే. దీంతో అసలు హరిహరవీరమల్లు షూటింగ్ ఎప్పుడు పూర్తవ్వాలి.. ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, అసలు అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Did you notice this shot in hariharaveeramallu and Khushi

ఇలాంటి అనుమానాలు, సందేహాల నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ.. హరిహరవీరమల్లు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించారు. హరిహరవీరమల్లును రెండు భాగాలుగా తీసుకువస్తామని చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది. తొలి భాగం ''హరిహరవీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ''గా రాబోతోంది.

టీజర్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. పవన్ కళ్యాణ్ ఓ యాక్షన్ సీన్‌లో రెండు కత్తులతో దుండగుల గుంపులో నిలబడి వారిని తెగనరుకుతూ వుంటారు. అయితే గతంలో పవర్‌స్టార్ ఆల్‌టైమ్ హిట్ మూవీ 'ఖుషీ'లోనూ అచ్చం ఇదే తరహాలో ఓ ఫైట్ ఉంటుంది. అందులో మార్షల్ ఆర్ట్స్‌లో వినియోగించే చైన్‌తో రౌడీ గ్యాంగ్‌ చితక్కొడుతూ ఉంటాడు. ఈ రెండు సీన్‌లను పోల్చుతూ పవన్‌లోని మార్షల్ ఆర్ట్స్‌ టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి సినిమాల్లోకి పవన్ ఎంట్రీనే మార్షల్ ఆర్ట్స్ బేస్డ్‌గా జరిగింది. పవర్‌స్టార్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన వాటిని ప్రదర్శించారు. ఆ తర్వాత తమ్ముడు, ఖుషిలలోనూ పవన్ మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ చూపించారు.

Did you notice this shot in hariharaveeramallu and Khushi

మళ్లీ దాదాపు 20 ఏళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్‌ను ఆయన టచ్ చేశారు. హరిహరవీరమల్లు సినిమా స్టార్ట్ అయిన కొత్తలో కత్తి పట్టుకుని మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్న పవన్ వీడియో , ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్ధాల తర్వాత మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నానంటూ పవన్ దానికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజా టీజర్‌లో ఆయన పడిన కష్టం, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఖుషి, హరిహరవీరమల్లులోని పవన్ మార్షల్ ఆర్ట్స్‌‌తో ఫైట్ చేసే సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్లయినా ఆయనలో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ నిత్య విద్యార్ధేనంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలావుండగా.. హరిహరవీరమల్లు టీజర్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తారని వెల్లడించారు. నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ వంటి సినిమాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేశారు జ్యోతికృష్ణ. సినిమా పూర్తి కావడంలో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నిర్మాత వెల్లడించారు. హరిహరవీరమల్లులో బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X