విజయ్ దేవరకొండ మరో పవన్ కళ్యాణ్.. అందుకు ఒక బలమైన కారణం ఉంది: దిల్ రాజు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో ఒక చిన్న నెగిటివ్ పాత్రలో కనిపించిన ఈ టాలెంటెడ్ హీరో ఆ తర్వాత రెండు మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద తన స్థాయిని అమాంతంగా పెంచుకున్నాడు. కష్టపడి సోలోగా పైకి వచ్చిన విజయ్ దేవరకొండ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇక అతను పవన్ కళ్యాణ్ లాంటి హీరో అంటూ ఇటీవల దిల్ రాజు చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రౌడీ బాయ్స్ సినిమా లాంచ్ ఈవెంట్ కు వచ్చిన విజయ్ దేవరకొండపై దిల్ రాజు పాజిటివ్ గా కామెంట్ చేశారు. అంతేకాకుండా గతంలో అతనితో ఉన్న అనుబంధం గురించి కూడా వివరణ ఇచ్చాడు.

టైటిల్ కోసం విజయ్ అనుమతి
రౌడీ బాయ్స్ సినిమా అనుకున్నప్పుడు సినిమా టైటిల్ విషయంలో విజయ్ నుంచి ముందుగానే అనుమతి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తన ట్యాగ్ రౌడీ బాయ్స్ అని ఉంటుందేమో అని అడిగాను. కానీ అలాంటిదేమీ లేదు అని కేవలం రౌడీస్ అని విజయ్ చెప్పగానే అనుమతి ఈ సినిమాకు రౌడీ బాయ్స్ అని పేరు పెట్టడం జరిగింది. సినిమా కథకు తగ్గట్లుగానే టైటిల్ పెట్టాలని అనుకున్నాను. తప్పకుండా యూత్ అందరికీ కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అని దిల్ రాజు చెప్పారు.

విజయ్ తో నా జర్నీ
విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. విజయ్ కు నాకు ఒక చిన్నపాటి జర్నీ అయితే ఉంది. మాది చాలా విచిత్రమైనది జర్నీ. గతంలో అతను కేరింత సినిమాలో ముగ్గురు హీరోలలో ఒకరి కోసం ఫోటో షూట్ కూడా చేయడం జరిగింది. కానీ అప్పుడు నేను చూడలేదు. ఇక ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా విడుదలయ్యే సమయంలో ఆ సినిమాను నాకు చూపించాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ నేనప్పుడు ఆస్ట్రేలియా హాలిడేలో ఉండడం వలన చూడడం కుదరలేదు.. అని అన్నారు.

పవన్ కళ్యాణ్ తరహాలోనే..
ఇక ఆ తర్వాత అతను చేసిన అర్జున్ రెడ్డి ఒక క్లాసిక్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్ లో చేసిన గీత గోవిందం సినిమా సక్సెస్ తర్వాత ఈవెంట్ కు నేను వెళ్లడం జరిగింది. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను. నా ఈ 20 ఏళ్ల సినీ ప్రయాణంలో.. పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైతే మంచి యూత్ ఫ్యాన్స్ దొరికారో విజయ్ దేవరకొండ కూడా అతి తక్కువ సమయంలోనే అలాంటి అభిమానులు దొరికారు. కేవలం మూడు నాలుగు సినిమాలతోనే ఆ రెంజ్ లో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. అని చెప్పారు.
Recommended Video

విజయ్ తో సినిమా చేయాల్సి ఉంది..
అర్జున్ రెడ్డి హిట్ అయినప్పుడే నేను ఆ మాట చెప్పాను. పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి అలాంటి మంచి స్టార్ దొరికాడు అని. ఇది మా సినిమా అయినప్పటికీ నీ గురించి మాట్లాడిన అవసరం ఉంది విజయ్. ఎందుకంటే కేరింత సమయంలో ఫోటోషూట్ చేసినప్పుడు నీతో సినిమా చేయాలి. ఇక ఇప్పుడు కూడా చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అని ఫైల్ రాజు వివరణ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. ఆ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రౌడీ బాయ్స్ ఈవెంట్ కు వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని దిల్ రాజు వివరణ ఇచ్చారు


Click it and Unblock the Notifications











