Rowdy Boys: ఓటీటీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న యువ హీరో.. అనుపమ రొమాన్స్ కు కుర్రాళ్లు ఫిదా!

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ బాయ్స్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించాడు. ఆశిష్ రెడ్డి కి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఇక దిల్ రాజు అంచనాలకు తగ్గకుండా సినిమా కథకు తగ్గట్టుగా ఈ సినిమాను మంచి బడ్జెట్తో నిర్మించారు. అంతేకాకుండా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా హుషారు దర్శకుడు హర్ష కానుగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ మది ఈ సినిమాకు వర్క్ చేసిన విధానం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

తన సోదరుడి కుమారుడు కోసం ఏ మాత్రం తగ్గకుండా రౌడీ బాయ్స్ సినిమాను నిర్మించిన దిల్ రాజు ప్రొడక్షన్ పరంగా మంచి మార్కులు అందుకున్నాడు. ఇక సినిమాకు ఇంకా అనుకున్నంతగా పాజిటివ్ టాక్ రాకపోయిన్నప్పటికీ ఓటీటీలో మాత్రం భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం విశేషం. బీటెక్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కొట్లాటలో నేపథ్యంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ డ్రామా ప్రస్తుతం ఓటీటీ లో వీక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. జి ఫైవ్ లో ఇటీవల విడుదలైన రౌడీ బాయ్స్ సినిమా కొన్నిరోజులకే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Dil raju family hero ashish reddy rowdy boys movie new record in OTT

ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు పది కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ అందుకోవడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఆమె మొదటిసారి ఎవరూ ఊహించని విధంగా రొమాంటిక్ పాత్రతో కాస్త డోస్ పెంచి సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. లిప్ లాక్ సన్నివేశంలో మాత్రమే కాకుండా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా అనుపమ పరమేశ్వరన్ మొదటి సారి తన పరిధులను దాటేసింది అనే కామెంట్స్ కూడా అందుకుంది. ఆమె పాత్ర కూడా ఈ సినిమాలో చాలా బాగా హెల్ప్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాలు మేజర్ హైలెట్ పాయింట్.

మొదటి సినిమాతోనే ఆశిష్ రెడ్డి మంచి నటిగా గుర్తింపు అందుకున్నాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ డిజిటల్ ప్లాట్ ఫాం లో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటుంది అని అర్థమయిపోయింది. ఇక దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి తో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రెండు కథలపై చర్చలు జరిపిన ఆయన త్వరలోనే ఒక కొత్త దర్శకుడితో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన యువ దర్శకుడు ఆశిష్ రెడ్డితో తదుపరి సినిమాకు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రౌడీ బాయ్స్ సినిమా మొత్తానికి ఓటీటీ లో ఈ విధంగా ఓ వర్గం వారి నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఆశిష్ రెడ్డి తన తదుపరి సినిమాలో ఏ స్థాయిలో గుర్తింపు ఉండకుంటాడో చూడాలి. త్వరలోనే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఆశిష్ రెడ్డి తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ రానున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X