Don't Miss!
- News
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ''కొత్త డ్యూటీ''
- Sports
ఆ విషయంలో వృద్ధిమాన్ సాహాకు లైన్ క్లియర్.. ఇక రంజీట్రోఫీలో ఆ జట్టు తరఫున బరిలోకి..
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Automobiles
జున్ నెల అమ్మకాలలో అదరగొట్టిన టీవీఎస్ మోటార్ కంపెనీ.. జులై 6న కొత్త టూవీలర్ లాంచ్!
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
పుష్ప కారణంగా ఆ కథను కన్ఫ్యూజన్ లో పెట్టిన అల్లు అర్జున్.. దిల్ రాజు షాకింగ్ రియాక్షన్!
అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా మార్కెట్ లో తన స్థాయిని పెంచుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కూడా అంతకు మించి అనేలా తెరపైకి రాబోతున్నట్లు గా తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాకముందే నిర్మాతలకు భారీ స్థాయిలో ఆఫర్స్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 700 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇటీవల కథనాలు వెలువడ్డాయి.
అయితే ఆ సినిమా కారణంగా అల్లు అర్జున్ స్థాయి పెరిగిపోవడంతో అంతకుముందు ఒప్పుకున్న ప్రాజెక్టులు అసలు సెట్స్ పైకి వస్తాయా రావా అనేది అనుమానంగా మారాయి. ఇప్పటికే అల్లు అర్జున్ కొరటాల శివను వెయిట్ చేయించలేక నో చెప్పేసిన విషయం తెలిసిందే. దీంతో కొరటాల శివ ఆ కథను ఎన్టీఆర్ కు తగ్గట్టుగా మార్చి పాన్ ఇండియా మూవీ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఐకాన్ కూడా ఉంది. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఐకాన్ సినిమా గత ఏడాది నుంచి వాయిదా పడుతూనే ఉంది. అసలు ఆ సినిమా ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే ఆడియన్స్ లో చాలానే ఉంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు ఆ ప్రాజెక్టు పై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. నిజానికి ఐకాన్ ప్రాజెక్ట్ పుష్ప 2 కంటే ముందే రావాలి.
కాకపోతే అల్లు అర్జున్ పుష్ప 1 తర్వాత ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు చేరుకోవడంతో ఆ తర్వాత వచ్చే ప్రాజెక్టులు కూడా అదే తరహాలో ఉండాలి అని ఇక పుష్ప సెకండ్ పార్ట్ కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఐకాన్ సినిమా కూడా ఆ సినిమా రిజల్ట్ ను బట్టి తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది అని దిల్ రాజు వివరణ ఇచ్చారు. పుష్ప 1 సినిమా సాధించిన విజయంతో బన్నీ సెకండ్ పార్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే మిగతా ప్రాజెక్టులన్నింటినీ కూడా పక్కన పెట్టేశాడు మరి పుష్ప తర్వాత అసలు ఐకాన్ ఉంటుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.