నాకు పవన్ కళ్యాణ్ నే స్ఫూర్తి.. ఆయన కష్టం తలుచుకుంటే.. దిల్ రాజ్ ఎమోషనల్!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ జీవితంతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వాస్తావానికి 17 ఏళ్ల కింద నుంచే పవర్ స్టార్ పొలిటికల్ పార్టీ, ప్రొగ్రామ్స్, ఎలక్షన్స్ పై రాత్రింబవళ్లు వర్క్ చేస్తూ వస్తున్నారు. దాదాపు ఎన్నో విఫలయత్నాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనా పార్టీ అధినేతగా, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 70వేల మెజార్టీని సొంతం చేసుకున్నారు. అలాగే 21 సీట్లకు 21 సీట్ల ఎమ్మెల్యేను గెలుపొందారు. 100శాతం స్ట్రైక్ రేట్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇదంతా తెలిసిందే.

అయితే.. తాజాగా దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎంత మంది అభిమానులు, భక్తులు ఉంటారో తెలిసిందే. లక్షల మంది పవన్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. ఆయన హీరోగా తెరపై కనిపించడం మొదలు ఎందో మందిని ఇన్ స్పైర్ చేశాడు పవన్ కళ్యాణ్. అందులో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఉండటం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. స్వయంగా దిల్ రాజే పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని చెప్పారు. అయితే ఎందుకు అలా చెప్పాడో కూడా వివరించారు.

Dil Raju says Pawan Kalyan is inspiration for his Life Producer said why

పవన్ కళ్యాణ్ తనకు 25 ఏళ్లు తెలుసునని చెప్పారు. తొలిప్రేమ నుంచే చాలా సన్నిహితంగా ఉంటానని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే పొలిటికల్ వైపు వ్యూహాలు రచించే వారంట. ఇక గబ్బర్ సింగ్ టైమ్ లో కెరీర్ మంచి పీక్స్ లో ఉండగా పొలిటికల్ పార్టీ పనులు ప్రారంభించారని తెలిపారు. ఆ సమయంలో అందరూ పవన్ కళ్యాణ్ ను తిట్టిపోశారని, మంచిగా సినిమాలు చేసుకోక పాలిటిక్స్ ఎందుకని విమర్శించారని తెలిపారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిగా అనుకున్న లక్ష్యం వైపే అడుగులు వేశారన్నారు. ఒకసారి వెళ్లి ఘోర పరాజయం పొందారని, అప్పటికీ వెనకడుగు వేయకుండా కొన్నాళ్లు సినిమాలు చేసి.. తిరిగి పంజా విసిరారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో గెలుపొందారని తెలిపారు. అయితే.. ఆయన పొలిటికల్ జర్నీ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఆగకుండా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ జీవితాన్ని తలుచుకుంటే ఎనర్జీ వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు. తన జీవితంలో డౌన్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నే తలుచుకుంటానని చెప్పుకొచ్చారు. ఆయనే నాకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలనలో డిప్యూటీ సీఎం బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరిస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాలను కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. నెక్ట్స్ 'హరిహర వీరమల్లు' చిత్రంతో అలరించబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మార్చిలో డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలతోనూ అలరించబోతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రాబోతున్న సినిమాలు కాబోతుండటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Read more about: dil raju pawan kalyan tholi prema
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X