దిల్ రాజుకు షాకిచ్చిన నాగ చైతన్య.. హాట్ టాపిక్
నిజ జీవితంలో కొన్ని సందర్భాలు ఊహించని షాకులిస్తుంటాయి. సాధారణ జనంలోనే కాదు సెలెబ్రిటీ లోకంలోనూ ఇది కామనే. ఈ నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య తీసుకున్న ఓ డిసీజన్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు షాకిచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే భార్య సమంతతో కలిసి మజిలీ రూపంలో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న చైతూ ప్రస్తుతం తన మేనమామ వెంకటేష్ తో కలిసి వెంకీమామ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తికాగానే నాన్న నాగార్జున బంగార్రాజు సినిమాలో నటించనున్నాడు చైతూ. ఇవి ఇలా ఉండగానే ఇటీవలే శేఖర్ కమ్ముల సినిమాను కూడా ఓకే చేశాడు నాగచైతన్య. ఇదే నిర్మాత దిల్ రాజును ఇరుకున పడేసింది.

నిజానికి నాగ చైతన్యతో దిల్ రాజు ఓ సినిమా చేయాలనుకున్నారు. నూతన దర్శకుడు శశితో ఈ సినిమా ఉండనుందని తెలిసింది. జూన్ నెల లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని కూడా భావించారు. ఇంతలో చైతూ.. శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయనకు డేట్స్ సర్దుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న శేఖర్ కమ్ముల సినిమా పూర్తయ్యాకనే దిల్ రాజు సినిమా గురించి ఆలోచిద్దామని చైతూ భావిస్తున్నాడట.
ఈ రకంగా దిల్ రాజుకు ఊహించని షాక్ తగిలిందని చెప్పుకుంటున్నారు సినీ జనం. కొత్త దర్శకుడు శశిని నాగచైతన్య డేట్స్ కొరకు వెయిట్ చేయమని చెప్పాలో లేక వేరే హీరోతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారట దిల్ రాజు. మరోవైపు వెంకీమామ సినిమా ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా శేఖర్ కమ్ముల, చైతూ సినిమా ఈ ఆగస్టులో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











