పట్టభద్రులైన దిల్ రాజు.. మీ ఊహకే వదిలేస్తున్నానంటోన్న విశ్వక్ సేన్
మాస్ కా దాస్ ఫలక్‌నుమా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తెరపై ఎంత మాస్‌గా ఉంటాడో.. నిజ జీవితంలోనూ అంతే మాస్‌గా ఉంటాడు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే చెప్పేస్తాడు. విశ్వక్ సేన్ తనపై వచ్చే నెగెటివిటీ, ట్రోలింగ్‌ను కూడా అంతే స్థాయిలో తిప్పి కొడుతుంటాడు. విశ్వక్ ప్రస్తుతం పాగల్ మూవీతో బిజీగా ఉన్నాడు.
దిల్ రాజు నిర్మిస్తోన్న పాగల్ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే వదిలిన పాటలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో దిల్ రాజు, శైలేష్ కొలను, విశ్వక్ సేన్ ముగ్గురూ కూడా పట్టభద్రులైనట్టు కనిపిస్తోంది. పాగల్ మూవీ షూటింగ్ కోసం ఇలా రెడీ అయినట్టు తెలుస్తోంది.అయితే ఈ ఫోటోను షేర్ చేసిన విశ్వక్ అదిరిపోయే కామెంట్ పెట్టాడు.

నో క్యాప్షన్స్.. మీ ఊహలకే వదిలేస్తున్నా అని విశ్వక్ కామెంట్ చేశాడు. బ్రో ఎక్కువ చదువుకోకు.. పాడైపోతావ్ అని అల్లు శిరీష్ కౌంటర్ వేశాడు. ఇక శైలేష్ కొలను స్పందిస్తూ.. మా జీవిత కాలం పాటు గుర్తుంచుకునే క్షణాలివి.. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు దిల్ రాజుకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు. కానీ ఇలా గెటప్‌లు ఎందుకు వేసుకున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











