twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మరో హిట్ డైరెక్టర్.. గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. కానీ..

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో నిన్నటి వరకు ఆచార్య సినిమా కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు ఇక రేపటి నుంచి మహేష్ బాబు సినిమా కోసం ఎదురు చూడబోతున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అభిమానులు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలు కూడా ఇప్పటికే అంచనాలు స్థాయిని ఒక్కసారిగా పెంచేశాయి. ఇక త్వరలోనే రాబోయే ట్రైలర్ కూడా అంతకు మించి అనేలా ఉంటుంది అని అనిపిస్తోంది. ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమా నుంచి స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక అధికారికంగా లాంచ్ చేసిన త్రివిక్రమ్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. అంతేకాకుండా మహేష్ బాబు రాజమౌళి తో కూడా ఒక పాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతనే ఆ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే మహేష్ బాబుకు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్మెంట్ అయితే ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి విజయాన్ని అంధించడంతో మహేష్ బాబుకు అనిల్ రావిపూడి చాలా బాగా కనెక్ట్ అయ్యాడు.

     Director Anil ravipudi clarification on mahesh babu project

    అతనితో మరో సినిమా కూడా చేయాలని ఆ సినిమా షూటింగ్ లోనే మహేష్ మాట కూడా ఇచ్చేశాడు. అసలైతే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మరొక సినిమా చేసే అనిల్ రావిపూడి తో వెంటనే మరొక ప్రాజెక్టును మొదలు పెట్టాలి అని అనుకున్నాడు. కాని కరోనా పరిస్థితులు ప్లాన్స్ ను చేంజ్ చేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ ప్రాజెక్టు ఎప్పుడు అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు.

    స్క్రిప్ట్ అయితే దాదాపు పూర్తయిందని మహేష్ బాబు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు మొదలు పెట్టేస్తాను అని వివరణ ఇచ్చాడు. అయితే మహేష్ కు ఇప్పుడున్న కమిట్మెంట్స్ వలన డేట్స్ దొరుకుతాయో లేదో తెలియదు. కానీ డేట్స్ ఇస్తే మాత్రం తప్పకుండా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత త్వరగా ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఈ దర్శకుడు తెలియజేశాడు. మరో వైపు అనిల్ రావిపూడి F3 సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ కోసం మరొక కథను సిద్ధం చేయబోతున్నాడు. బాలకృష్ణతో గతంలోనే ఒక సినిమాని చేయాలి అనుకున్నప్పటికి అనుకోకుండా ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ కూడా చాలా బిజీ గానే ఉన్నాడు. కాబట్టి మధ్యలో మరో హీరోతో సినిమా చేసిన తర్వాత బాలకృష్ణ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక మహేష్ బాబుతో సినిమా అయితే అప్పట్లో కుదరదని తెలుస్తోంది.

    English summary
    Director Anil ravipudi clarification on mahesh babu project..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X