twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య పుట్టినరోజు మరో ప్రాజెక్ట్ పై క్లారిటీ.. అప్డేట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్

    |

    నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనేక రకాల అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఏడాది ఎలాగైనా వరుస సినిమాలతో ప్రేక్షకులకు మరింత ఆనందం ఇస్తానని బాలయ్యబాబు ఇదివరకే వివరణ ఇచ్చారు. గతంలో అఖండ సినిమాతో ఆయన ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది.

    అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ సినిమా కెరీర్లోనే ఆ సినిమా ఒక సంచలన రికార్డును క్రియేట్ చేసింది. మొత్తానికి అఖండ సినిమా తర్వాత బాలయ్య బాబు మరో మాస్ యాక్షన్ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 105వ ప్రాజెక్టు టీజర్ను గురువారం రోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అదే తరహాలో దర్శకుడు ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.

    director anil ravipudi clarification on nandamuri balakrishna 108 project

    ఇక మరొక వైపు అనిల్ రావిపూడి కూడా బాలయ్య బాబుతో NBK 108వ ప్రాజెక్టును వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇక పుట్టినరోజు సందర్భంగా ఈ దర్శకుడు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చాడు. ముందుగా నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దర్శకుడు అనిల్ రావిపూడి ఒక స్పెషల్ ఫోటోను కూడా షేర్ చేసుకున్నాడు.

    ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అయిందని అంటూ త్వరలోనే మరిన్ని అప్డేట్స్ కూడా తెలియజేస్తామని వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు 40 ఏళ్ళ వయసులో కనిపిస్తాడట. అలాగే శ్రీ లీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటిస్తుందని దర్శకుడు ముందే చెప్పాడు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు అసలు కథను పూర్తిగా సిద్ధం చేసుకున్నాడు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయమని బాలయ్య బాబు కూడా అడిగినట్లుగా ఇటీవల ఒక టాక్ అయితే వినిపించింది. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

    English summary
    director anil ravipudi clarification on nandamuri balakrishna 108 project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X