భారతీరాజా మరణంతో రజనీ, విజయ్ కంటతడి.. చిరంజీవి, పవన్ కల్యాణ్, రాజమౌళి ఎమోషనల్

జూన్ 10న కన్నుమూసిన దక్షిణాది సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజాకు సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నీటి నివాళులర్పించారు. సీఎం విజయ్ స్వయంగా శ్రద్దాంజలి ఘటించి కన్నీటి పర్యంతమయ్యారు. చిరంజీవి, ఎస్ఎస్ రాజమౌళి తమ సంతాపాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఐదు దశాబ్దాల పాటు దక్షిణాది సినిమాను శాసించిన భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రజనీ ఎమోషనల్ అయ్యారు. గ్రామీణ నేపథ్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. భారతీరాజాతో తనకున్న ప్రత్యేక బంధం గురించి రజనీ పంచుకున్న విషయాలు ఇప్పుడు అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి.

మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. భారతీరాజాతో తనకున్న ప్రొఫెషనల్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "భారతీరాజాకు నా నటన కంటే నా వ్యక్తిత్వమే ఎక్కువ ఇష్టం" అని రజనీ పేర్కొన్నారు. స్టైలిష్ స్టార్‌డమ్ కంటే సహజమైన నటనను ఇష్టపడే భారతీరాజాకు, రజనీకి మధ్య ఉన్న విడదీయలేని స్నేహానికి ఈ మాటలే నిదర్శనం. వీరిద్దరి కళాత్మక శైలులు వేరైనా, వ్యక్తిగతంగా మాత్రం ఎంతో సన్నిహితంగా ఉండేవారు.

Director Bharathiraja Passes Away Superstar Rajinikanth Pays Emotional Tribute to the Legend

రజనీకాంత్ ఎమోషనల్ ట్రిబ్యూట్.. '16 వయతినిలే'తో ఉన్న ఆ ప్రత్యేక అనుబంధం

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 1977 నాటి క్లాసిక్ '16 వయతినిలే' (తెలుగులో పదహారేళ్ల వయసు) ఒక సంచలనం. ఇందులో రజనీ పోషించిన 'పరట్టై' అనే నెగటివ్ రోల్ ఆయన కెరీర్‌నే మలుపు తిప్పింది. స్టైల్‌తో పాటు నటనలో లోతును ఎలా చూపించాలో భారతీరాజా విజన్ రజనీకి నేర్పింది. గ్రామీణ వాస్తవికతను వెండితెరపై ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ సినిమా అటు తమిళ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల గమనాన్నే మార్చేసింది.

సంవత్సరం సినిమా పేరు రజనీ పాత్ర
1977 16 వయతినిలే పరట్టై
1988 కొడి పరక్కుతు ఈరోడ్ శివగిరి

తెలుగు, దక్షిణాది సినిమాలపై భారతీరాజా చెరగని ముద్ర

భారతీరాజా కేవలం తమిళ దర్శకుడిగానే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమపై కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'సీతాకోక చిలుక' ఇప్పటికీ టాలీవుడ్‌లో ఒక బెంచ్‌మార్క్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. మానవ సంబంధాలను, భావోద్వేగాలను ఎంతో సహజంగా తెరకెక్కించడంలో ఆయన దిట్ట. తనదైన శైలిలో కథలు చెబుతూ ప్రాంతీయ భాషల మధ్య ఉన్న దూరాన్ని చెరిపేశారు. ఆయన ప్రభావం నేటికీ సినీ రంగంపై స్పష్టంగా కనిపిస్తుంది.

భారతీరాజాకు కమల్ హాసన్, ఇతర దక్షిణాది తారల నివాళులు

రజనీకాంత్‌తో పాటు ఉలగనాయగన్ కమల్ హాసన్ కూడా భారతీరాజా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు భారతీరాజా నివాసానికి చేరుకుని ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. ఒక గొప్ప శకం ముగిసిందంటూ చిత్ర పరిశ్రమ మొత్తం కన్నీటి పర్యంతమైంది.

భారతీరాజా మరణం భారతీయ సినిమాకు తీరని లోటు. రజనీకాంత్ మాటలు వింటే గొప్ప కళాకారుల మధ్య ఉండే సాన్నిహిత్యం ఎంత సింపుల్‌గా ఉంటుందో అర్థమవుతుంది. సామాన్యమైన విషయాల్లోనూ అందాన్ని వెతికే ఆయన వారసత్వాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆయన సినిమాలు రాబోయే తరాల దర్శకులకు, నటులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో ప్రముఖ దర్శకులు శ్రీ భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై శ్రీ భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన 'సీతాకోకచిలుక' ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య శ్రీ చిరంజీవి గారితో 'ఆరాధన' చిత్రం రూపొందించారు. అందులో 'అరె ఏమైంది...' అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా 'ఎర్ర గులాబీలు', 'టిక్ టిక్ టిక్' లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. శ్రీ భారతీరాజా గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

గ్రామీణ మట్టి వాసనను సినిమా తెరపైకి తీసుకొచ్చి గుభాలింపు చేశారు. మానవ సంబంధాలను చక్కగా తన పాత్రల ద్వారా చూపించారు. అమాయకత్వమైన ప్రేమ, సాధారణ ప్రజల భావోద్వేగాలు పరిశీలిస్తే.. పది కాలాలపాటు దృశ్య కావ్యాలుగా మిగిలిపోతాయి. తన సినిమాలతో లక్షలాది మంది అభిమానుల హృదయాలను టచ్ చేశారు. ఆయన దర్శకత్వంలో ఆరాధన లాంటి సినిమాలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి సుదీర్గమైన తన అనుభవాలను రాసుకొన్నారు.

భారతీరాజా గారు తన సినిమాలు, తన కథల ద్వారా సినీ తెరపై విప్లవం తీసుకురావడమే కాకుండా నిజమైన మార్గదర్శిగా నిలిచారు. గ్రామీణ నేపథ్యంగా రూపొందించిన సినిమాలు ఎప్పటికీ మరిచిపోలేనివి. కథ చెప్పడంలో ఎలాంటి సంకోచం లేని విజన్, వాస్తవికతనే ఆయన సినిమాలను సజీవంగా నిలిచేలా చేశాయ అని రాజమౌళి ట్వీట్ చేశారు.

Read more about: entertainment cinema news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X