మొదటిసారి అలాంటి ప్రయోగం చేయబోతున్న బన్నీ.. ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే బాక్సాఫీస్ హిట్టే..?
పుష్ప సినిమాతో మొత్తానికి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే హిందీలో 60 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు హిందీలో మంచి వసూళ్లను అందుకున్న సౌత్ టాప్ సినిమాలలో పుష్ప సినిమా టాప్ 4లో నిలిచింది. ఎంత విచిత్రం అంటే రెండు వారాల కంటే మూడో వరమే సినిమా అత్యధిక వసూళ్లను అందుకునే దిశగా వెళుతోంది. ఈ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరూ ఊహించలేకపోయారు.
అల్లు అర్జున్ చాలా సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయగా వందల మిలియన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రభావం థియేట్రికల్ గా ఉంటుందా లేదా అనే అనుమానాలు చాలా వచ్చాయి. కానీ నిర్మాతలు బన్నీ మీద నమ్మకంతో తోనే చివరి నిమిషం వరకు కూడా ఆలస్యమైనా సరే హిందీ లో భారీ స్థాయిలో విడుదల చేశారు. ఒక విధంగా హిందీలో పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా మంచి వసూళ్లు అందాయి. ఇటీవల కాలంలో 15 రోజుల తర్వాత కూడా ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడం అంటే ఆశ్చర్యమే అని చెప్పాలి. ఏదేమైనా కూడా బన్నీ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్న క్లారిటీ వచ్చేసింది. ఇక రాబోయే సినిమాలో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా విడుదలవుతాయని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప సీక్వెల్ తో పాటు ఐకాన్ అనే సినిమాను కూడా పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఐకాన్ సినిమా విషయంలో బన్నీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఉందట. ఇప్పటివరకు బన్నీ తన సినీ జీవితంలో ఎప్పుడూ కూడా డబుల్ యాక్షన్ చేసింది లేదు. ఇక బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో వరుసగా మూడుసార్లు డ్యూయల్ రూల్స్ చేయించి బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు బన్నీతో చేయబోయే సినిమాకు కూడా అదే ఫార్ములా వాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఒక కథపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కథ సిద్ధమైతే అఫీషియల్ ఎనౌన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. త్వరలోనే ఈ కాంబినేషన్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు బోయపాటి శ్రీను బాలయ్యతో కూడా మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కానీ అంతకంటే ముందే బన్నీతో సినిమాను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ లిస్టులో అయితే కొరటాల శివ తో కూడా కమిట్ మెంట్ అయితే ఉంది. కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా అనంతరం బన్నీతో అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











