Don't Miss!
- News
శ్రీవారిని దర్శించుకున్న లోకేష్ - గంటసేపు ఆపడంపై బీటెక్ రవి ఫైర్- చీప్ ట్రిక్స్ అంటూ..
- Finance
Adani Shares: మరక కడిగే పనిలో అదానీ.. నిన్న ఖండన నేడు రంగంలోకి.. ఏం జరుగుతోంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Sports
సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా స్టార్.. రికార్డుల మీద రికార్డులు బద్దలు!
- Lifestyle
నిద్ర లేమి దురద:ప్రాణహాని కలిగించే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు దారితీస్తుందా?
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
క్రాక్ 2 సినిమాపై అదొరిపోయే అప్డేట్ ఇచ్చిన గోపిచంద్.. స్టార్ట్ ఎప్పుడంటే?
మాస్ మహారాజ రవితేజ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందించిన క్రాక్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2021 లో మళ్లీ థియేటర్స్ తెరుచుకున్న సమయంలో ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యులకు మాత్రమే కాకుండా ఒక సినిమా ప్రపంచం మొత్తానికి కూడా నమ్మకాన్ని కలిగించింది అని చెప్పవచ్చు.
ఆడియెన్స్ ను కరోనా భయం నుంచి థియేటర్స్ కు రప్పించడంలో క్రాక్ సక్సెస్ అయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాలో రవితేజకు జోడిగా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. క్రాక్ సినిమాలో మాస్ యాక్షన్ సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా థమన్ ఇచ్చిన సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. అయితే ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుంది అని కూడా ప్రేక్షకులు కోరుకున్నారు.

ఇక అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు దర్శకుడు ఇంతకుముందే ఒకసారి అన్నాడు. అయితే ఇటీవల ధమాకా సినిమా ప్రమోషన్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఆ విషయం పై స్పందించాడు. రవితేజతో ఇంతకుముందే దర్శకుడు డాన్ శీను, బలుపు అనే సినిమాలు కూడా చేశాడు. ఇక క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ మరొక క్రాక్ తో వాస్తము అని అన్నాడు.

రవితేజ పై తనకున్న ప్రేమను నా సినిమాల ద్వారానే తెలియజేసుకుంటాను అంటూ.. క్రాక్ 2 సినిమా మాత్రం అంతకుమించి అనేలా ఉంటుంది అని తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా తెరపైకి తీసుకు వస్తాము అని కూడా అన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసింది. 2023 సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక క్రాక్ 2 సినిమాను స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైన తర్వాత వచ్చే ఏడాది చివరిలో మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.