పవన్ కళ్యాణ్‌తో ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న స్టార్ డైరెక్టర్.. మరో పవర్ఫుల్ రోల్!
సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్, హీరో కాంబినేషన్ అంటే చాలు అభిమానుల్లో అంచనాల డోస్ అకాశాన్ని దాటేయడం కాయం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోపై కూడా అంచనాలు అకాశాన్ని దాటేశాయి. గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేసిన ఈ ఇద్దరు ఈసారి అంతకంటే హై వోల్టేక్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల హరీష్ శంకర్ బద్రి సినిమాలోని వీడియో పోస్ట్ చేసి మళ్ళీ అంతకంటే హై లెవెల్లో ఎనర్జీని చూస్తారని చెప్పకనే చెప్పాడు. అలాగే మరొక సెంటిమెంట్ ను కూడా ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బద్రి సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల వకీల్ సాబ్ లో కూడా పవన్ తో వాధించే లాయర్ పాత్రలో కనిపించాడు.

ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్నాయి. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. విలన్ గా చేస్తాడా లేక సపోర్టింగ్ పాత్రలో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రకాష్ రాజ్ తో పాటు సినిమాలో స్టార్ క్యాస్ట్ భారీగానే ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ లో సరదాగా ఉండే సినిమా సెకండ్ హాఫ్ లో ఒక్కసారిగా హై వోల్టేజ్ డ్రామాగా మారుతుందట. మంచి సోషల్ మెస్సేజ్ ఇచ్చే సినిమాగా నిలుస్తుందని ఇదివరకే హరీష్ శంకర్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











