NTR 30: నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. ఈసారి అంతకుమించి అంటూ కొరటాల శివ హైప్

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా విషయంలో ఓ వర్గం నందమూరి అభిమానులు అయితే పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు అనే చెప్పాలి. ఎన్టీఆర్ అయితే కొమురం భీమ్ పాత్ర చేసినందుకు చాలా సంతోషపడ్డాడు. తన కెరియర్ లోనే ఇది ఒక మంచి పాత్ర అంటూ ఎంతగానో సంతోషించాడు. కానీ ఓ వర్గం నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ పాత్రను గెస్ట్ రోల్ తరహాలో చుపించినట్లు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక రామ్ చరణ్ పాత్రను హైలెట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ పాత్రను పూర్తిగా తగ్గించేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒక స్నేహభావంతోనే రామ్ చరణ్ తో మంచి సినిమా చేసిన అనుభూతి కలిగింది అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.

ఎక్కువశాతం అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలయికను చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాపై కూడా కోసం కూడా నందమూరి వీరాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన 30 వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా సరైన అప్డేట్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్లు ఏడాది మొదట్లోనే క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఆ విషయంలో కూడా అప్ డేట్ అయితే రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు.

Director Koratala siva comments on Jr NTR upcoming project

ఆచార్య ప్రమోషన్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై కూడా ఒక మంచి కిక్ ఇచ్చే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలైతే జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సమయంలోనే తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడుకున్నట్లు చెప్పాడు. ఆ సినిమా క్లాస్ గా ఉండడంతో తదుపరి సినిమా మాత్రం పూర్తిగా మాస్ తరహా లో ఉండాలని అప్పుడే అనుకున్నట్లు కొరటాల తెలియజేశాడు. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా లో మాత్రం గతంలో ఎప్పుడూ లేని ఒక బిగ్గెస్ట్ స్టోరీని చూపించబోతున్న ట్లు చెబుతూ ఎన్టీఆర్ను కూడా పవర్ ఫుల్ మాస్ పాత్రలో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలిపాడు.

ఆ సినిమా కాన్వాస్ చాలా పెద్దది అని.. పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఎన్టీఆర్ రేంజ్ ను మ్యాచ్ చేస్తూ ఉండే కథ అని కొరటాల చెప్పాడు. ఇక తన కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ స్టోరీ అని కూడా తెలియజేశాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు తన కెరీర్లో మిర్చి అతిపెద్ద మాస్ సినిమా అని ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మాత్రం అంతకు మించి మాస్ అనే తరహాలో ఉంటుందనీ వివరణ ఇవ్వడం విశేషం. కొరటాల శివ ఇచ్చిన అప్డేట్ తో ప్రేక్షకుల్లో మాత్రం ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో చేయబోయే ప్రాజెక్టు కోసం తన ఫిట్నెస్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లోనే స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X