Jr ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోయే సర్‌ప్రైజ్ ఇదే.. అలా సెట్ చేసిన స్టార్ డైరెక్టర్!

RRR సినిమా తో మొత్తానికి పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా విషయంలో ఇదివరకే చాలా రకాల రూమర్స్ అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ కు కూడా గురిచేశాయి. ఆ ప్రాజెక్టు పై ఎన్టీఆర్ అంతగా సంతృప్తిగా లేరు అని కొరటాల శివ ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో కొంత అప్సెట్ అయ్యాడు అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఎన్టీఆర్ కొరటాల శివ తో చేయబోయే కథకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు గా వార్తలు వచ్చాయి. పూర్తి స్థాయిలో నమ్మకం గా అనిపించే వరకు కూడా షూటింగ్ స్టార్ట్ చేయవద్దు అని ఎన్టీఆర్ కూడా తన నిర్ణయాన్ని చెప్పినట్లుగా చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ అయితే పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆచార్య సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ కొంత మాట్లాడిన విషయం నిజమే కానీ పూర్తి స్థాయిలో అయితే స్క్రిప్టు విషయంలో మార్పులు చేర్పులు ఏమి చేయవద్దు అని చెప్పినట్లుగా తెలుస్తోంది.

Director koratala siva preparing special poster for Jr ntr project

ఇక ప్రాజెక్టుకు సంబంధించిన కథ బిగ్ కాన్వాస్ లో ఉంటుందని జనతా గ్యారేజ్ కంటే హై లెవెల్ లో ఉంటుంది అని కొరటాల శివ ఇదివరకే వివరణ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ మాఫియా కు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయని మరొక టాక్ వినిపించింది. ఇక ఆ సంగతులన్నీ పక్కన పెడితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ 20వ తేదీన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఆరోజు 30వ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేస్తారని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి రాబోతోంది కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పోస్టర్ ఉండాలి అని ఆలోచిస్తున్నారట. అంతే కాకుండా ఇప్పటికే కొన్ని టైటిల్స్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా సినిమా పోస్టర్లు మాత్రమే విడుదల చేస్తారని సమాచారం.

ఇక ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుతో పాటు ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్ట్ పై కూడా అదే రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా గత కొన్ని వారాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఆ విషయంపై కూడా అఫీషియల్గా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ పక్కాగా కొరటాలశివ అయితే ఒక పోస్టర్ ను విడుదల చేస్తాడు అని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X