ప్రభాస్ తో గుప్తనిధుల కథ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన సీనియర్ డైరెక్టర్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఒకప్పుడు తనతో వర్క్ చేసిన చిన్న తరహా నటీనటులను టెక్నీషియన్లను కూడా ఏమాత్రం చిన్న చూపు చూడడు అని అందరికీ తెలిసిన విషయమే. కొందరు ఒక రేంజ్ నుంచి మరో రేంజ్ కు వెళుతున్న క్రమంలో ఒకప్పుడు వర్క్ చేసిన వారిని చూసి చూడనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ ఆ విధంగా కాకుండా మొదట్లో వర్క్ చేసిన దర్శకులతో కూడా ఇప్పటికే అదే తరహా సాన్నిహిత్యంతో కొనసాగుతున్నాడు.
అయితే కృష్ణవంశీ కూడా అదే విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. త్వరలోనే ఈ దర్శకుడు రంగమార్తాండ అనే సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెలిసింది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ సంబంధించిన ఒక పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రభాస్ తో కృష్ణవంశీ చక్రం అనే సినిమాను తీశాడు. అసలు వారు మొదట ఆ సినిమాను చేయాలని అనుకోలేదట.

ప్రభాస్ లుక్ ను బట్టి కృష్ణవంశీ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను తెరపైకి తీసుకురావాలి అని అనుకున్నాడట. మ్యాడ్ మ్యాక్స్ తరహాలో గుప్త నిధుల వేటలో ఒక మంచి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ ప్రభాస్ కు మాత్రం ఆ సమయంలో అందరూ యాక్షన్ కథలు చెబుతూ ఉండటంతో మీ నుంచి ఏదైనా మంచి యాక్టింగ్ స్కూప్ ఉండే పాత్ర చేయాలని ఉంది అని అంన్నాడు. అందుకే చక్రం కథను రెడీ చేశానని కృష్ణవంశీ అన్నాడు. ఆ కథ రిస్క్ అని తెలిసిన కూడా ప్రభాస్ ఎంతో ఇష్టంగా చేసినట్లు కృష్ణవంశీ తెలియజేశాడు. చక్రం సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ప్రభాస్ ఎప్పుడు కలిసినా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు అని.. కథలు చెప్పడానికి రావడం లేదు అని కూడా అడుగుతాడు అని కృష్ణవంశీ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











