బాలయ్య సైకో, ఫ్యాన్ ని చితగ్గొట్టాడు... డైరెక్టర్ కేఎస్ రవికుమార్ సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ లోని సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య తరచుగా అభిమానులను కొడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా ప్రముఖ డైరెక్టర్ కెఎస్ రవి కుమార్ బాలయ్య సైకో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన బాలయ్యపై ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు అనే ఇంట్రెస్టింగ్ విషయంపై మనమూ ఓ లుక్కేద్దాం పదండి.

కేఎస్ రవికుమార్ దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా, స్క్రీన్ రైటర్ అండ్ యాక్టర్ గా మూవీ లవర్స్ కు సుపరిచితుడు. ముందుగా తమిళ చిత్ర పరిశ్రమలో పని చేసిన ఆయన ఆ తర్వాత తెలుగులో కూడా దర్శకుడి, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన బాలకృష్ణపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Director KS Ravikumar sensational comments on Balakrishna scene during janani janmabhoomi movie shooting

తాను కే విశ్వనాథ్ దగ్గర అసోసియేట్ గా పని చేస్తున్నప్పుడు జననీ జన్మభూమి అనే సినిమాను చేశాము అంటూ అప్పట్లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. 1983లో సాగర సంగమం సినిమా తీసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు స్వయంగా విశ్వనాధ్ గారిని మా అబ్బాయితో ఓ సినిమా తీయండి అని అడిగారని చెప్పుకొచ్చారు.

ఆ సినిమాకి తాను కూడా వర్క్ చేయడంతో అప్పుడు బాలయ్య తనతో క్లోజ్ గా ఉండేవాడని, పైగా ఆ సినిమా షూటింగ్ తన ఊరుకు దగ్గరలోనే జరిగిందని వెల్లడించారు రవికుమార్. ఆ సినిమా చేస్తున్నప్పుడు బాలయ్య యంగ్ గా ఉండేవాడని, తన ఏజ్ గ్రూప్ వాళ్లతో సరదాగా ఉండేవాడని చెప్పుకొచ్చారు. అయితే రాను రాను ఆయన సైకోలా తయారయ్యాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రవికుమార్.

అయితే సైకో అంటే చెడ్డవాడు అని అర్థం కాదని, ఒకరకంగా చెప్పాలంటే చిన్న పిల్లాడి మనస్తత్వమని అంటారని, కానీ అలాగని ఎవరిని పడితే వాళ్ళను కొడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు కేఎస్ రవికుమార్. అయితే వాళ్లలో ఒక రకమైన ఉన్మాదం వచ్చి బ్యాడ్ గా బిహేవ్ చేస్తారని, ఆయన అప్పట్లో చేసిన ఒక పని వల్ల బాలయ్య అంటే మనసు విరిగిపోయింది అంటూ అప్పట్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

జననీ జన్మభూమి సినిమా చేస్తున్న సమయంలో ఫ్యాన్స్ అంటూ కొంతమంది కుర్రాళ్ళు వచ్చి బాలకృష్ణతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపించారని, అలా ఒకరి తర్వాత ఒకరు సెల్ఫీలు తీసుకుంటుండగా ఒకతను మాత్రం అనుకోకుండా బాలకృష్ణ భుజంపై చేయి వేశాడని అన్నారు రవికుమార్. ఇంకేముంది అతన్ని బాలకృష్ణ చితగ్గొట్టేసాడని షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు రవికుమార్.

అలా చేయడం తప్పు అంటూ అభిమానంతోనే అలా చేస్తారని, ఒకవేళ అభిమానులు లేకపోతే హీరోలు ఎక్కడ ఉన్నారని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు రవికుమార్. అక్కడితో ఆగకుండా ఎంతటి కుసంస్కారి అతను? ఎవరైనా తిరిగి లాగి కొడితే ఏం చేస్తారు? అప్పుడు పరువు పోవడం తప్ప ఇంకేముంటుందని అన్నారు రవికుమార్.

అయితే ఆయన అన్నట్టుగానే ఇప్పటిదాకా బాలయ్య ఎంతోమందిని కొట్టి వార్తల్లో నిలిచారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కేఎస్ రవికుమార్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X