ప్రభాస్ తో ఆ సినిమా నిజం కాదు.. క్లారిటీ ఇచ్చిన తమిళ స్టార్ దర్శకుడు.. ఏమన్నారంటే?

ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో అయితే నెవ్వర్ బిఫోర్ అనే కాంబినేషన్స్ అయితే వెండితెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా దర్శకులు హీరోలు వివిధ రకాల ప్రయోగాత్మకమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ పరిధిని కూడా పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజు కూడా రాబోయే రోజుల్లో చాలామంది అగ్ర హీరోలతో వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి.

ఇక లోకేష్ కూడా నెవర్ బిఫోర్ అనే విధంగానే తన యూనివర్స్ ను మరింత పెద్దదిగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతని ఖైదీ సినిమా నుంచి కూడా అదే తరహా లైన్ లో కథలను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇక విక్రమ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న లియో సినిమా కూడా అంతకుమించి అనేలా ఉంటుంది అని అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

Director Lokesh kanagaraj clarifications on project rumours

తెలుగులో కూడా ఈ సినిమా హై రేంజ్ లోనే బిజినెస్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే లోకేష్ కనగరాజు ప్రభాస్ రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లతో కూడా సినిమాలు చేస్తాడని చెప్పినట్లుగా తమిళ మీడియాలో కొన్ని కథనాలు అయితే వైరల్ అయ్యాయి. నిజానికి గతంలో రామ్ చరణ్ తేజ్ తో కూడా అతను చర్చలు జరిపాడు. అయితే మంచి బాండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎలాంటి కథను ఫైనల్ చేయలేదు అని తెలుస్తోంది.

ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న లోకేష్ కొంతమంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఇక అందులో రామ్ చరణ్ ప్రభాస్ లతో కూడా వర్క్ చేస్తారా అనే ప్రశ్న అతను చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. వారితో అయితే నాకు చాలా మంచి బాండింగ్ ఉంది కానీ ఎలాంటి కథలు అయితే ఇంకా ఫైనల్ కాలేదు అని ప్రస్తుతం వాళ్లు అందరూ కూడా రెండు మూడేళ్ల వరకు చాలా బిజీగా ఉన్నట్లుగా లోకేష్ తెలియజేసాడు. అయితే భవిష్యత్తులో అవకాశం వస్తే మాత్రం తప్పకుండా వారితో సినిమాలు చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని లోకేష్ తెలియజేశాడు. మొత్తానికి ప్రస్తుతం ప్రభాస్ లోకేష్ సినిమాపై వస్తున్న వార్తల్లో అయితే ఇలాంటి నిజం లేదు అని తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X