మెగా హీరోతో మారుతి కామెడీ ఎంటర్‌టైనర్!
మెగా హీరో అల్లు శిరీష్ బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళీ హిట్ చిత్రం ఎబిసిడి రీమేక్ లో నటిస్తున్నాడు. తెలుగులో కూడా ఈ చిత్రం ఎబిసిడి పేరుతోనే తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా అల్లు శిరీష్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో అల్లు శిరీష్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సక్సెస్ ని నిలబెట్టుకోవడానికి ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు.
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో అల్లు శిరీష్ రెండవసారి నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఎలాంటి కథమైన మంచి కామెడీ ఓడించి ఆడియన్స్ ఎంటర్ టైన్ చేయడంలో మారుతికి మంచి పట్టు ఉంది. సామాజిక అంశాలకు సెటైరికల్ కామెడీ జోడించి ఓ కథ సిద్ధం చేశాడట. ఈ కథని అల్లు శిరీష్ కు వినిపిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి జాతి రత్నం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మారుతి, అల్లు శిరీష్ కాంబోలో వచ్చిన కొత్త జంట చిత్రం పరవాలేదనిపించింది. మారుతి చివరగా తెరకెక్కించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం నిరాశపరిచింది. దీనితో తదుపరి మూవీ విజయం సాధించడం మారుతికి కూడా కీలకమే. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











