డేంజర్ జోన్‌లో ప్రభాస్.. ఇంత రిస్క్ అవసరమా అనగానే క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎలాంటి సినిమాలతో రెడీ అవుతున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఒక సినిమాకు సంబంధించిన కథనాలు ఇటీవల అబోమణులను కాస్త కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. ఎట్టకేలకు ఆ సినిమా దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు.

త్వరలోనే టీజర్
రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ ను త్వరలోనే ఫినిష్ చేయనున్నారు. వీలైనంత త్వరగా టీజర్ ను కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఒకేసారి మూడు సినిమాలు
ఇక రాదేశ్యామ్ తో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా ఇప్పటికే కొంత షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ఇక మరోవైపు ఆదిపురుష్ షూటింగ్ కూడా స్పీడ్ అందుకుంటొంది.

డేంజర్ జోన్ లో ప్రభాస్
అయితే ఇటీవల ఆదిపురుష్ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక రూమర్స్ అందరిని కన్ఫ్యూజన్ లో పడేసాయి. అభిమానులు కూడా కొంత ఆందోళన చెందారు. ఇంత రిస్క్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. సినిమా షూటింగ్ సభ్యులు డేంజర్ జోన్ లో ఉన్నారని ఆలస్యంగా తెలుసుకున్న ప్రభాస్ సినిమా షూటింగ్ ను వెంటనే ఆపేయ్యలని నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
Recommended Video

క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
అయితే మొత్తానికి ఆ విషయంపై దర్శకుడు ఓం రావత్ స్పందించాడు. సినిమా షూటింగ్ లో కొంతమందికి కరోనా వచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ షూటింగ్ ఆగిపోయినట్లు వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. షూటింగ్ ఎప్పటిలానే కొనసాగుతోందని తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











