Salaar Leaks: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సీరియస్.. సెట్స్ లో కఠినమైన రూల్స్.. ప్రభాస్ అయినా పాటించాల్సిందే!

ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా షూటింగ్ దశలోనే కొన్ని లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై దర్శకుడు చాలా సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

అంతకుమించి అనేలా సక్సెస్

అంతకుమించి అనేలా సక్సెస్

KGF ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తదుపరి సినిమాను సలార్ తో కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అయింది.

సోషల్ మీడియాలో లీక్

సోషల్ మీడియాలో లీక్

అయితే సలార్ సినిమాకు సంబంధించి ఇటీవల కొన్ని లుక్స్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం అందరినీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కొందరు మొబైల్ ఫోన్స్ తో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన లొకేషన్ లో జరిగిన సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో లీకైనట్లుగా తెలుస్తోంది.

డైరెక్టర్ ఆగ్రహం

డైరెక్టర్ ఆగ్రహం

సలార్ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా చాలా రకాల ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. అయితే గతంలోనే దర్శకుడు ప్రశాంత్ ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యాడు. అయినప్పటికీ ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉండడంతో ఈసారి మరింత ఆగ్రహానికి లోనాయిట్లుగా తెలుస్తోంది.

కఠినమైన ఆంక్షలు

కఠినమైన ఆంక్షలు

ఎవరు కూడా ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీయకుండా ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను కూడా సిద్ధం చేసినప్పటికీ అదే తరహాలో మళ్లీ ప్రభాస్ కు సంబంధించిన ఫోటోలు లీకవుతూ ఉండడం దర్శకుడు కోపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇక వెంటనే ఈ సారి మరింత కఠినమైన అంశాలను విధించాలి అని మరో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఫోన్స్ లేకుండా..

ఎవరు కూడా సెట్స్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదు అని షూటింగ్ సమయంలో బయటి వాళ్ళను ఎవరిని కూడా అక్కడ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదనే బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే షెడ్యూల్ మరింత ముఖమైంది కావున ఆ సమయంలో స్టార్స్ ఎవరూ కూడా వారి ఫోన్లు కూడా తీసుకురాకూడదని ప్రభాస్ అయినా సరే తన ఫోన్ క్యారావాన్లో పెట్టి రావాల్సిందే.. అనే రహాలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ తరహా నిర్ణయంతో సలార్ లీక్స్ ను ఆపుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X