Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కేజీఎఫ్2 తర్వాత భారీ అప్‌డేట్
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా మన హీరోలు ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా దర్శకులు కూడా విభిన్నమైన హీరోలతో సినిమాలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులతో కూడా సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల ఫోకస్ మొత్తం ఎక్కువగా సలార్ సినిమాపైనే ఉంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధే శ్యామ్ సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియాలోనే అత్యధిక స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాగా కూడా నిలిచింది. దాదాపు వంద కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.
Recommended Video

ప్రభాస్ తో మంచి మాస్ సినిమా తీస్తే మళ్లీ ఫామ్ లోకి వస్తాడు అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ నుంచి అయితే నెక్స్ట్ ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తప్పకుండా సలార్ సినిమాతోనే ప్రభాస్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అని ప్రేక్షకులు గట్టి నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలైతే కేజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ సమయంలోనే థియేటర్స్ లో సలార్ టీజర్ ను కూడా విడుదల చేస్తారు అని ఒక ప్రచారం జరిగింది. అది అందరు నిజమే అని అనుకున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ కేజిఎఫ్ సక్సెస్ అనంతరం సలార్ సినిమాపై ఎక్కువగా పెడుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన భాగాన్ని మరికొన్ని రోజుల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ రెడీ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రభాస్ అభిమానులకు త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక టీజర్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం లో ఇదివరకే చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మే నెలలో నాలుగో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మే 25 తరువాత సలార్ టీజర్ను విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్ నిర్మాతలతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. మరి ఆ టీజర్ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.