పవన్ కల్యాణ్ తో పూరి జగన్నాథ్ చీటింగ్..అలా మోసం చేశాడట!

నలుగురిది ఓ దారైతే ఆయనది మరో దారి .. అది కూడా ఎవరికీ అంతుచిక్కదు. తన గురువు రామ్ గోపాల్ వర్మను చాలా దగ్గరి నుంచి చూశాడేమో కానీ ఆయన లక్షణాలన్నీ పూరి జగన్నాథ్‌లో కనిపిస్తాయి. ఈ తరం దర్శకుల్లో అతి తక్కువ సమయంలో వేగంగా సినిమాలు చేసిన ఘనత ఆయనదే. ఇప్పుడంటే స్పీడ్ తగ్గింది కానీ గతంలో ఏడాదికి 3 నుంచి 4 సినిమాలు చేసేవారు జగన్. హీరోని, హీరోయిజాన్, హీరో బాడీ లాంగ్వేజ్‌ని కొత్తగా చూపించడంలో పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడు. నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుందని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ సరిగ్గా అతికినట్టుగా సరిపోతుంది.

తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలా , పది మందికి ఆదర్శప్రాయంగా, కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే త్యాగశీలిగా , అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తిగా ఓ మార్క్ ఉండేది. కానీ పూరి సినిమాల్లో హీరోలు పొరంబోకుల్లా, జులాయిల్లా, ఊరనాటుగా లెక్కలేనితనంతో కనిపిస్తారు. జగన్నాథ్ చేతుల్లో పడిన ఏ కథానాయకుడైనా సరే కొత్తగా మేకోవర్ అయిపోతుంటారు. సినిమా ఫ్లాప్ అయినా సరే సదరు హీరోకు కొత్త మాస్ ఇమేజ్ రావడం మాత్రం పక్కా. ఇప్పటికీ పూరీ జగన్నాథ్ సినిమా అంటే అందులో ఏదో ఒక వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు.. ముఖ్యంగా యువత భావిస్తుంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఆయన సినిమా కష్టాలు పడినా.. నమ్మినవాళ్లే రూ.కోట్లలో మోసం చేసినా ఎక్కడా ఆయన అధైర్యపడలేదు.

director Puri Jagannadh how to get chance with power star Pawan Kalyan

పూరి జగన్నాథ్ లాంటి డాషింగ్ డైరెక్టర్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌దే. కొత్తదనాన్ని, యంగ్ టాలెంట్‌ను ప్రొత్సహించడంలో పవన్ ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే పూరికి బద్రీ సినిమాలో అవకాశం కల్పించారు పవర్‌స్టార్. వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న పవన్.. కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి సాహసమే చేశారు. అయితే ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు పూరి జగన్నాథ్. బద్రిలోని పాటలు, ఫైట్స్, డైలాగ్స్ యువతరాన్ని ఒక ఊపాయి.

అయితే పవన్ వద్దకు వెళ్లడానికి పూరి జగన్నాథ్‌కు అంత తేలిగ్గా అవకాశం రాలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన సన్నిహితుడైన , సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడిని కలిసి పవన్‌ని కలిసే ఛాన్స్ ఇప్పించండి అని అడగ్గా.. ఆయన ఈ విషయాన్ని తన అన్నయ్య ఛోటా కే నాయుడుకు చెప్పారు. పూరి వెళ్లి ఛోటా కే నాయుడిని కలవగా.. నువ్వు మంచి కథ చెప్పకుంటే పవన్ వద్ద తన పరువు పొతుందని, ముందు నాకు చెప్పు అనడంతో అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉన్న ఇల్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పానని పూరి తెలిపారు. అది ఛోటాకు నచ్చడంతో పవన్‌ కలిసేందుకు అవకాశం ఇప్పించారని చెప్పారు.

director Puri Jagannadh how to get chance with power star Pawan Kalyan

పవన్ నుంచి తెల్లవారుజామున 4 గంటలకు రమ్మని పిలుపొచ్చిందని.. కేవలం అరగంట మాత్రమే సమయం ఇవ్వగా.. అది కాస్తా నాలుగు గంటలైందన్నారు. కథ పవన్ కళ్యాణ్‌కు బాగా నచ్చిందని.. అయితే క్లైమాక్స్ మాత్రం మార్చాలని సూచించారని తెలిపారు. ఆయన సలహా మేరకు క్లైమాక్స్ మార్చాలని కసరత్తు మొదలుపెట్టగా.. తనకు నచ్చినట్లుగా సీన్ రాలేదని పూరి చెప్పారు. వారం తర్వాత పవన్‌ను కలవగా.. క్లైమాక్స్ విషయం ప్రస్తావించారని, ఎన్ని సీన్లు రాసినా రావడం లేదని చెప్పానని పేర్కొన్నారు. దీనికి పవన్ నవ్వేసి.. నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికే ఇలా చేశానని అన్నారని పూరి తెలిపారు. ఇదే సమయంలో తాను ఛోటాకి చెప్పిన కథ ఇది కాదు కదా అని ప్రశ్నించడంతో అవాక్కయి .. జరిగిన విషయం పవన్ కళ్యాణ్‌కు చెప్పానని పూరి జగన్నాథ్ గుర్తుచేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X