twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్ధరాత్రి చిరు వచ్చిన ఆనందంలో ఫ్యాన్ అరుపులు.. పాన్ డబ్బా స్టోరీ చెప్పిన పూరి జగన్నాథ్

    |

    నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు అభిమానులు ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సోషల్ మీడియాలో మెగాస్టార్ తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ఆయన ఇంకా మరెన్నో సినిమాలతో మన ముందుకు రావాలి అని కోరుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా తనదైన శైలిలో మెగాస్టార్ కు బర్త్ డే విషెస్ అందిస్తూ ఆయనతో ఉన్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

     అర్ధరాత్రి వచ్చి..

    అర్ధరాత్రి వచ్చి..

    పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ఇది జరిగి దాదాపు ఒక 15 ఏళ్ళవుతోంది. ఆయన ఇంటి పక్కనే అప్పట్లో నా ఆఫీస్ ఉండేది. హఠాత్తుగా ఒకరోజు రాత్రి వచ్చి బోర్ కొడుతోంది. అలా సరదాగా బయటకు వెళదాం పదా అన్నారు. ఎక్కడికి అని అడిగినప్పటికీ ఎక్కడికో నాకు కూడా తెలియదు వెళ్తాం పదా అని అన్నారు. అప్పట్లో మాదాపూర్ లో అలా వెళుతున్నాం. అప్పట్లో ఇంకా ఆ ఏరియా అంతగా డెవలప్ కాలేదు.

    పాన్ డబ్బా దగ్గర కారు ఆపి..

    పాన్ డబ్బా దగ్గర కారు ఆపి..

    ఇప్పుడు ఫోరమ్ మాల్ ఉన్నచోట ఒక్క బిల్డింగ్ లేదు. ఖాళీ మట్టి రోడ్డు కానీ ఒకే ఒక్క దగ్గర ఒక పాన్ షాప్ ఉంది. ఇక అక్కడే ఆయన ఎంతో ఇష్టంగా ఒక పాన్ కట్టించుకుందామా అని అన్నాడు. ఇక కారు ఆపగానే పాన్ షాప్ లో ఒకతను బేరాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక అలాగే అతను కారులోకి చూడగానే మెగాస్టార్ కనిపించాడు. దీంతో వెంటనే అతడు డబ్బా నుంచి దూకేసి బాస్ సార్ అంటూ గట్టిగా అరిచాడు.

    గట్టిగా అరుస్తున్నాడు

    గట్టిగా అరుస్తున్నాడు

    ఇక మెగాస్టార్ గారు కూల్ గా ఒక పాన్ కావాలి అన్నారు. అతను మళ్ళీ పాన్ డబ్బా లోపలికి వెళ్లి ఆకులు తీసి పాన్ కడుతూ ఉన్నాడు. కానీ ఆ పాన్ కట్టే సమయంలో అతను అటు ఇటు తిరుగుతూ రేయ్ మెగాస్టార్ వచ్చారని గట్టిగా అరుస్తున్నాడు. కానీ అక్కడ దరిదాపుల్లో ఒక్క మనిషి కూడా లేడు. ఒక మెగాస్టార్ తన షాప్ ముందుకు వచ్చాడు అని ఎవరితో అయినా చెప్పుకోవాలి అని అతను అనుకున్నాడు.

    ఎప్పటికీ మర్చిపోలేను..

    ఎప్పటికీ మర్చిపోలేను..

    మొత్తం మీద అతను పాన్ కట్టి ఇచ్చాడు కానీ డబ్బులు వద్దు అని అన్నాడు. కానీ చిరంజీవి గారు 200 ఇచ్చారు. మళ్ళీ ఆయన కారు తిప్పి అలా వెళ్ళిపోతుంటే ఆ పాన్ డబ్బా వ్యక్తి మెగాస్టార్ అంటూ అరుస్తూనే ఉన్నాడు. పాపం అతను చాలామందికి ఈ విషయం చెప్పి ఉంటాడు. కానీ ఎవరు కూడా అతని మాటలు నమ్మి ఉండకపోవచ్చు. కానీ అతను ఆ రోజు ఆయన ఎక్సైట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. నా టైం బాగుంది కాబట్టి ఆయన పక్క సీట్లో నేనున్నాను. ఒకవేళ నేను ఆ పాన్ డబ్బా అతని ప్లేస్లో ఉండుంటే అలానే అరిచే వాన్ని.. అని పూరి జగన్నాథ్ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

    English summary
    director puri Jagannath about megastar chiranjeevi mid night pan story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X