Akash Puri: మా నాన్న డైరెక్షన్‌లో సినిమాలు చేయొద్దనుకుంటున్నాను.. ఎందుకంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఒకప్పుడు అధ్బుతమైన సినిమాలు చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న ఆయన ఇప్పుడు రామ్ పోతినేనితో కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన కొడుకు ఆకాష్ పూరీ తన తండ్రి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమా చేయాలని తనకు లేదని చెప్పుకొచ్చారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హీరోగా పలు చిత్రాలు చేసిన ఆకాష్ పూరీ.. తాజాగా ఓ క్లాంతిగ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఈవెంట్ లోనే ఆయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను సినిమాలు చేసేందుకు చాలా ఆసక్తిగానే ఉన్నప్పటికీ ఎక్కువగా గ్యాప్ వచ్చేసినట్లు చెప్పారు. కానీ మంచి కథ కోసమే తాను ఈ గ్యాప్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికి చాలా కథల్ విన్నానని.. ఓ రెండు, మూడు సెలక్ట్ కూడా చేసుకున్నానని ఆకాష్ పూరీ వెల్లడించారు. త్వరలోనే ఆ సినిమా అప్ డేట్లను అందిస్తానన్నారు.

Director Puri Jagannath Son Akash Puri Said He is Not Intrested to do Film in The Direction of His Father Check Details

అలాగే తన తండ్రి పూరీ జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారని.. ఇటీవలే తాను ఆ సినిమా రఫ్ కట్ టీజర్ చూశానని చెప్పారు. అది చాలా బాగుందని.. రామ్ పోతినేని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతారంటూ వివరించారు. అలాగే మీ నాన్నగారి డైరెక్షన్ లో మీరేమైనా సినిమాలు చేసే ఛాన్స్ ఉందా అని అడగ్గా... లేదని నిర్మొహమాటంగా చెప్పాడు ఆకాష్ పూరీ. ముఖ్యంగా తన తండ్రితో కలిసి సినిమాలు చేయాలని తనకు లేదని క్లారిటీ ఇచ్చాడు. ఎందుకు అని అడగ్గా... క్లారిటీ కూడా ఇచ్చారు.

తాను హీరోగా మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాకే.. తన తండ్రితో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు వివరించారు. కొడుకుతో పూరీ జగన్నాథ్ సినిమా తీస్తున్నాడని అంతా చెప్పుకోవడానికి బదులుగా.. హీరో ఆకాష్ పూరీతో ఆయన తండ్రి, పూరీ జగన్నాథ్ సినిమా చేస్తున్నారని చెప్పుకోవాలనేది తన కళ అని అందుకే ఇప్పట్లో తండ్రితో సినిమాలు చేయాలనుకోవట్లేదని వివరించారు.

Director Puri Jagannath Son Akash Puri Said He is Not Intrested to do Film in The Direction of His Father Check Details

అలాగే తన తండ్రి.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందని ఆకాష్ పూరీ చెప్పుకొచ్చాడు. తన తండ్రితో గొడవ పెట్టుకుని అయినా సరే.. చిరంజీవి గారితో సినిమా చేయాలని చెబుతానంటూ వివరించాడు. మెగాస్టార్ చిరంజీవి తన ఫేవరెట్ హీరో అని తనకు దేవుడి లాంటి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే త్వరోలనే మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X