జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి.. ఎందుకంటే?
టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ RRR కోసం ఆడియెన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగా నందమూరి అభిమానులకి కాంబినేషన్ గిఫ్ట్ రెడీ చేస్తున్న రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో అని అందరు ఎదురుచూస్తున్నారు. మెయిన్ గా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం పరభాషా సినీ ప్రేక్షకులు కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఫస్ట్ లుక్కుతోనే వైబ్రేషన్స్..
సినిమాకు సంబంధించిన మొదటి లుక్కుతోనే ఆడియేన్స్ లో ఒక కొత్త తరహా వైబ్రేషన్స్ కలిగించాడు జక్కన్న. మోషన్ పోస్టర్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజమౌళి అంచనాల డోస్ ని అకాశాన్ని దాటించేశాడు. ఇక రామ్ చరణ్ ఫస్ట్ టీజర్ సైతం మెగా అభిమానులకు మంచి కిక్కిచ్చింది. ఇక నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కోసం వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అభిమానుల్లో కన్ఫ్యూజన్..
మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఆ రోజు కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయాలని RRR టీమ్ ప్లాన్ చేసుకుంది. తారక్ అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగానే చరణ్ కూడా ఎన్టీఆర్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తాడాని అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఆ డేట్ కి తారక్ ని చూస్తామా? అనే సందేహం ఏర్పడింది. రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి కూడా ఈ కన్ఫ్యూజన్ పై స్పందించాడు.

ఎందుకంటే..?
లాక్ డౌన్ కారణంగా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని మెయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయాలంటే కొన్ని షాట్స్ తో పాటు ఎడిటింగ్ వర్క్ కూడా చేయాల్సి ఉందని ఉన్నారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ఏక్కడిపనులు అక్కడే ఆగిపోయాయి అంటూ.. లాక్ డౌన్ తరువాత పరిస్థితులను బట్టి వర్క్ జరిగే అవకాశం ఉందని.. మంచి ప్రాడక్ట్ వచ్చే వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి టీజర్ ని విడుదల చేయలేమని రాజమౌళి ఒక వివరణ ఇచ్చారు.
Recommended Video

నెక్స్ట్ మహేష్ బాబుతో..
గత మూడేళ్ళ నుంచి మహేష్ అభిమానులను ఊరిస్తున్న కాంబినేషన్ పై ఫుల్ క్లారిటీ వచ్చింది. రాజమౌళి చాలా కాలం తరువాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని ఒక వివరణ ఇచ్చారు. RRR సినిమా తరువాత నిర్మాత కెఎల్.నారాయణతో మహేష్ బాబుతో బిగ్ బడ్జెట్ సినిమాను అనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఒక్కసారిగా మహేష్ అభిమానుల్లో ఆనందం హద్దులు దాటేసింది. ఇక ఆ ప్రాజెక్టు రావడానికి రెండేళ్ల సమయమైన పట్టవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











