RC 15: దిల్ రాజు - రామ్ చరణ్ కు మాట ఇచ్చిన శంకర్.. అప్పటిలోగా సినిమా ఫినిష్!
రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఇండియన్ 2 సినిమా వివాదాన్ని వదిలించుకున్న శంకర్ ఇక నుంచి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు. వీలైనంత వరకు దిల్ రాజు పై అత్యదిక బడ్జెట్ భారం వేయకుండా అనుకున్న బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. శంకర్ - దిల్ రాజు మధ్యలో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు.
భారతీయుడు సినిమాను తెలుగులో రిలీజ్ చేసినప్పటి నుంచి వీరి ప్రయాణం కొనసాగుతోంది. శంకర్ నిర్మాతగా మారినప్పుడు వైశాలి అనే సినిమాను కూడా దిల్ రాజు ద్వారా తెలుగులో విడుదల చేయించారు. ఒకరి టాలెంట్ మరొకరికి బాగా తెలుసు. అందుకే ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నారు. అసలైతే ఇండియన్ 2 సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే తెరకెక్కాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా క్యాన్సిల్ అయ్యింది. ఇక రామ్ చరణ్ డేట్స్ దొరకడంతో శంకర్ కు చాలా ఈజీ అయ్యింది.

సాధారణంగా శంకర్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ ఎప్పుడు అనే విషయం గురించి పెద్దగా ఆలోచించడు. ఎందుకంటే సినిమా పర్ఫెక్ట్ గా వచ్చే వరకు కూడా ఆయన ఒక నిర్ణయానికి రారు. కానీ దిల్ రాజు - రామ్ చరణ్ కు ముందే మాట ఇచ్చేశారట. సినిమాను 2022 సమ్మర్ లోపు పూర్తి చేస్తానని చెప్పాడట.
శంకర్ కూడా అపరిచితుడు 2 సినిమాను వచ్చే ఏడాది సెట్స్ పైకి తేవాల్సి ఉంది కాబట్టి RC 15ను తొందరగా ఫీనిష్ చేస్తాడని క్లారిటీ వచ్చేసింది. ఇక హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో మొదట సాంగ్ ను షూట్ చేయనున్నారట. ఇప్పటికే థమన్ మొదటి ట్యూన్ ను రెడీ చేసినట్లు సమాచారం. మరి సినిమాను అనుకున్న సమయానికి అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











