మహేష్ - రాజమౌళి స్పెషల్ మీటింగ్.. ఓపిక పట్టలేక ప్లాన్ మారుస్తున్న జక్కన్న?

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం
RRR సినిమా ను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా 5 సార్లు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ నెలలో ఎలాగైనా విడుదల చేయాలని ఒక ప్రణాళిక అయితే సెట్ చేసుకున్నారు. ఇక రాజమౌళి మహేష్ సినిమా విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన ప్లాన్ సెట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతవరకు రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో వీరి కలయికలో రాబోయే మొదటి సినిమా పై అంచనాలు మామూలుగా ఉండవు అని చెప్పవచ్చు.

మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇక వీరి కలయికలో వచ్చే సినిమా పాన్ ఇండియా కాకుండా అంతకు మించి అనేలా ఉంటుందట. దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ఉంటాయి అని బాహుబలి అనంతరం చాలా క్లారిటీగా అర్థం అయిపోయింది. ఇప్పటికే ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మార్చిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే తరహాలో మార్కెట్లోకి దింపబోతున్నాడు. రాజమౌళి కారణంగా ఈ నలుగురు హీరోలు ఇండియన్ బాక్సాఫీస్ ను శాసించే దిశగా అడుగులు వేస్తారు అని చెప్పవచ్చు.

Director SS rajamouli special meeting with mahesh babu

అసలైతే RRR సినిమాను రిలీజ్ చేసిన అనంతరమే రాజమౌళి మహేష్ బాబు సినిమా పై ఫోకస్ పెట్టాలని అనుకున్నారు కానీ ప్రస్తుతం సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతుండడంతో అని ఒకసారి మహేష్ బాబుతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారట. ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ అలాగే లుక్స్ పై కూడా ఒకసారి మహేష్ బాబు తో చర్చలు జరిపితే బాగుంటుంది అనే రాజమౌళి ఒక సిట్టింగ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో మహేష్ బాబు తో అలాగే నిర్మాత తో కూడా ప్రత్యేకమైన మీటింగ్ ను నిర్వహిస్తారట. మహేష్ బాబు కూడా అదే కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలో కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసే రాజమౌళి సినిమాతో బిజీ అవ్వాలి అనుకుంటున్నాడు. ఇక రాజమౌళి ముందుగా ఎదో ఒకటి చెబితే దానికి తగ్గట్టుగా మహేష్ ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక రాజమౌళి ఆలస్యం చేయకుండా మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో తెరపైకి రాబోయే ఆ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీ లోనే ప్రముఖ నటి నటుల తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటి నటులు కూడా ఆ సినిమాలో కనిపిస్తారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X