ఆ సినిమా కోసం వేట మొదలుపెట్టిన సుకుమార్.. తీరిక లేకుండా బిజీబిజీగా..
దర్శకుడు సుకుమార్ మొత్తానికి పుష్ప ఫస్ట్ పార్ట్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. కరోనా కాలంలో థియేటర్స్ బిజినెస్ కష్టకాలంగా ఉన్న సమయంలో సినిమాను భారీగా విడుదల చేశారు. ఇక సినిమాకు మొదట నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఆ తర్వాత మంచి పాజిటివ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవడం విశేషం. సినిమా కోసం ఎంతగానో హార్డ్ వర్క్ చేసిన సుకుమార్ పుష్ప ద రైజ్ తో మొత్తానికి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు రెండవ భాగాన్ని కూడా వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు. అసలైతే పుష్ప సినిమాను కేవలం ఒక భాగంగానే తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ సినిమా నిడివి చాలా ఎక్కువ కావడంతో ఎడిటింగ్లో పోకూడదని ఆ తర్వాత రెండు భాగాలుగా విభజించాల్సి వచ్చింది.
రెండవ భాగం కోసం ఒక క్లైమాక్స్ సన్నివేశాన్ని భారీ స్థాయిలోనే షూట్ చేయాలని అనుకుంటున్నారు. అసలైతే మొదటి భాగం షూట్ చేసినప్పుడు సెకండ్ పార్ట్ షూట్ కూడా సగానికి పైగా అయిపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ విషయంలో దర్శకుడు సుకుమార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. మొదట అనుకున్న ప్లాన్ తరహాలో కాకుండా ఇప్పుడు మరొక కొత్త తరహా ప్లాన్ తో సెకండ్ పార్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని సిద్ధమయ్యారు. అందుకోసం సుకుమార్ ప్రత్యేకమైన లొకేషన్స్ కోసం వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు దర్శకుడు సుకుమార్ రియాలిటీకి దగ్గరగా ఉండేలా సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

మొదటి పార్ట్ లోకేషన్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లడానికి లొకేషన్స్ ఎంత అవసరమో ఈ సినిమాతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే సుకుమార్ ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా రెండవ భాగం కోసం బిజీబిజీగా అంతకుమించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సారి చాలా హ్యాపీగా టెన్షన్ లేకుండా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ను విడుదల చేసే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కు అస్సలు సమయం దొరక లేదు. కొన్ని సన్నివేశాల్లో ఎడిటింగ్ కూడా సరిగ్గా జరగలేదు అని విమర్శలు వచ్చాయి. సిజి వర్క్ పై కూడా దృష్టి పెట్టే సమయం దొరకలేదు.
అయితే పుష్ప రెండో భాగం విషయంలో మాత్రం అలా జరగకుండా వీలైనంత వేగంగా అన్ని పనులు ముగించుకొని ప్రమోషన్స్ లో పాల్గొనాలి అని సుకుమార్ ఆలోచిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఒక ప్రాజెక్టు చేయబోతున్నట్లు స్పెషల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతకుముందే విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ సినిమాను మొదలు పెట్టబోతున్న సుకుమార్ ఆ తర్వాత మెగాస్టార్ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











