4000 వేల కోట్ల పైనే .. మహేశ్ ఊచకోత అలా, SSMB 29 కలెక్షన్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ జోస్యం
బాహుబలి సిరీస్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో భారతదేశానికి ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించిపెట్టాడు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తన తర్వాత సినిమా ఉంటుందని రాజమౌళి ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇన్ని రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు #SSMB29పై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో మహేశ్ అభిమానులు హర్ట్ అవుతున్నారు. అయితే సినిమా రిలీజ్ కాకముందే ఈ మూవీ కలెక్షన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ వివరాల్లోకి వెళితే..
మహేశ్ - రాజమౌళి మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. జక్కన్న ఇప్పటి వరకు టచ్ చేయని యాక్షన్ అడ్వెంచర్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తారని ఫిలింనగర్ టాక్. ఇందుకోసం మహేశ్ బాబు కంప్లీట్‌గా మేకోవర్ అవుతున్నారు. లాంగ్ హెయిర్, షేవింగ్‌తో రుషిలా సూపర్‌స్టార్ కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అలాగే జిమ్‌లో వర్కవుట్స్‌తో జక్కన్న ఎలా కావాలంటే అలా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారు మహేశ్.

రోజులు గడుస్తున్నా ఎస్ఎస్ఎంబీ29 మూవీ అప్‌డేట్స్ ఏం బయటకు రాకపోవడంతో ఘట్టమనేని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు నాడు ఏదైనా పోస్టర్ కానీ, లుక్ కానీ వదులుతారని అనుకుంటే అక్కడా డిజప్పాయింట్ చేశారు. తర్వాత మత్తువదలరా 2 టీమ్ ఏకంగా రాజమౌళి నుంచే వివరాలు లాగే ప్రయత్నం చేసి ఫెయిలైంది. ఇక థియేటర్‌లో దేవర సినిమా చూడటానికి వచ్చిన మహేశ్ అభిమాని .. ఏకంగా రాజమౌళినే ఎస్ఎస్ఎంబీ29 అప్‌డేట్స్ చెప్పమని గోల గోల చేశాడు. అక్టోబర్ 10న దర్శకధీరుడి పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఏమైనా స్పెషల్ అనౌన్స్ ఉంటుందా అని ఇండస్ట్రీ అంతా వేయి కళ్లతో ఎదురుచూడగా మరోసారి నిరాశే ఎదురైంది..
ఈలోపు సినిమా షూటింగ్‌కు కావాల్సిన సెట్స్, లోకేషన్ కోసం రాజమౌళీ అన్వేషణ ప్రారంభించారు. అడవులు, కొండలు, కోనలు, గుట్టలను ఆయన వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జక్కన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక #SSMB29 బడ్జెట్ ఎంత, మహేశ్ బాబు తదితరుల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లనే దానిపై సోషల్ మీడియాలో రోజుకొక న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. బడ్జెట్ ఎంత అనేది ఇంకా ఫిక్స్ కాలేదని, ఎంత అవసరం అనుకుంటే అంత ఖర్చు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రొడ్యూసర్ తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. మహేశ్ - రాజమౌళీ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఏకంగా రూ. 1000 కోట్లు దాటుతుందని.. బిజినెస్ ఏకంగా రూ.2000 కోట్ల పైమాటేనని, రూ. 4000 కోట్లను క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే చరిత్ర సృష్టిస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఎస్ఎస్ఎంబీ 29తో టాలీవుడ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











