twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళ కారణంగా ఉదయ్‌ కిరణ్‌‌తో భారీ సినిమా ఆగింది.. వాస్తవాలు బయటపెట్టిన సీనియర్ డైరెక్టర్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూట్ లవర్ బాయ్ గా క్రేజ్ అందుకున్న నటుడు ఉదయ్ కిరణ్. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా కెరీర్ మొదట్లో ఒక రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే మెల్లగా అతని కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఒక సీనియర్ దర్శకుడు ఉదయ్ కిరణ్ తో కొన్నేళ్ల క్రితం అనుకున్న ఒక సినిమా ఆగిపోవడానికి గల కారణాలు చెప్పాడు.

    సైడ్ క్యారెక్టర్ కోసమని వచ్చి

    సైడ్ క్యారెక్టర్ కోసమని వచ్చి

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఇండస్ట్రీలో ఛాన్సులు అందుకున్న వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. అతని మొదటి సినిమా 'చిత్రం' అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. తేజ ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఒక సైడ్ క్యారెక్టర్ కోసమని వచ్చి ఆ సినిమాలో హీరోగా సెలెక్ట్ అవ్వడంతో అతని భవిష్యత్తు మారిపోయింది.

    ఆ సినిమా తరువాత

    ఆ సినిమా తరువాత

    ఇక 2001లో మరోసారి తేజ డైరెక్షన్ లోనే నువ్వు నేను అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా అప్పట్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. సినిమా హిట్టవ్వడంతో ఉదయ్ కిరణ్ కు రోజుకు పదుల సంఖ్యలో ఆఫర్స్ వచ్చి పడేవి. కానీ తొందరపడకుండా అతను కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు.

    లవర్ బాయ్ ఇమేజ్ రావడంతో

    లవర్ బాయ్ ఇమేజ్ రావడంతో

    నువ్వు నేను హిట్టవ్వగానే మనసంతా నువ్వే అదే ఏడాది విడుదలైంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్ కు ఆ సినిమాతో అమ్మాయిల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. లవర్ బాయ్ ఇమేజ్ రావడంతో అతను ఈజీగా స్టార్ హీరో అవుతాడని అంతా భావించారు.

    ఎన్ని చేసినా వర్కౌట్ కాలేదు

    ఎన్ని చేసినా వర్కౌట్ కాలేదు

    కానీ ఆ తరువాత ఉదయ్ కు సరైన విజయాలు దక్కలేదు. కలుసుకోవాలని, శ్రీరామ్, హొలీ వంటి సినిమాలు అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. 2013 వరకు చిన్న సినిమాలు ఎన్ని చేసినా కూడా వర్కౌట్ కాలేదు. అయితే మధ్యమధ్యలో ఉదయ్ కిరణ్ చేయాల్సిన కొన్ని పెద్ద సినిమాలు సడన్ గా ఆగిపోవడం వెనుక ఒక హస్త ఉండేదని రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ అందులో నిజం లేదని కొంతమంది దర్శకులు వివరణ ఇచ్చారు.

    ఉదయ్ కిరణ్ తో సినిమా ఆగిపోయింది

    ఉదయ్ కిరణ్ తో సినిమా ఆగిపోయింది

    ఇక రీసెంట్ గా సీనియర్ డైరెక్టర్ వీరభద్రం కూడా ఒక వివరణ ఇచ్చాడు. ఆహా నా పెళ్ళంటా, పూల రంగడు, భాయ్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వీరభద్రం 2005లో ఉదయ్ కిరణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కథ సెట్టయ్యింది. మంచి ప్రొడ్యూసర్ కూడా సెట్టయ్యడాని అనుకున్న సమయానికి ఆ సినిమా సడన్ గా క్యాన్సిల్ అయినట్లు చెప్పారు.

    Recommended Video

    Jia Sharma About Singer Koti| Kshana Kshanam
    అలా క్యాన్సిల్ అయ్యింది

    అలా క్యాన్సిల్ అయ్యింది

    ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరభద్రం మాట్లాడుతూ.. నువ్వు నేను సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం వలన ఉదయ్ కిరణ్ తో మంచి స్నేహం ఏర్పడింది. అయితే అతనితో కథ ఓకే చేయించుకున్న తరువాత ఒక పెద్ద ప్రొడ్యూసర్ నుంచి అతనికి ఆఫర్ వచ్చింది. అది చాలా పెద్ద ప్రొడక్షన్ అని ఉదయ్ కిరణ్ నా సినిమాను క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని ఉదయ్, అయినప్పటికి అతను చాలా మంచి వ్యక్తి అని వీరభద్రం వివరణ ఇచ్చారు.

    English summary
    Uday Kiran's last film release was big suspension. Uday Kiran, who made his last appearance in the movie 'chitram cheppina Katha', made many attempts to release the film. Also participated in some promotions events. But after Uday's suicide, who cares about the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X