మెగాస్టార్ సినిమా ఆగిపోలేదు.. అలా క్లారిటీ ఇచ్చిన యంగ్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటించగా కొరటాల శివ దర్శకత్వం వహించాడు. తప్పకుండా ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఎంతో బలంగా నమ్మారు. కానీ సినిమా దాదాపు 70 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.

మెగాస్టార్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాగా ఆచార్య నిలవడం విశేషం. అయితే ఆ సినిమా ప్రభావం తో మెగాస్టార్ చిరంజీవి తన లైనప్ లో ఉన్న రొటీన్ కమర్షియల్ సినిమాలను దూరం పెట్టే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపించింది. ముఖ్యంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసే అవకాశం లేదని కూడా కథనాలు వెలువడ్డాయి.

director venky kudumula clarification on megastar chiranjeevi upcoming project

ఎందుకంటే ఆ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని సినిమా తెరపైకి వస్తే రోటీన్ గానే ఉంటుంది అని కూడా కొంతమంది మెగాస్టార్ కు సలహా ఇవ్వడంతో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ న్యూస్ కూడా ఓ వర్గం ఆడియన్స్ అయితే నిజమే అనుకున్నారు. ఇక మొత్తానికి దర్శకుడు వెంకీ కుడుముల ఆ రూమర్స్ కు ఒక్క మాటతోనే క్లారిటీ ఇచ్చేశాడు.

విక్రమ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేసిన వెంకీ కుడుముల కమల్ హాసన్ తో మాట్లాడుతూ తన తదుపరి సినిమా పై కూడా క్లారిటీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా తాను ఒక సినిమా చేయబోతున్నానని చెప్పాడు. ఇక ఆ ప్రాజెక్ట్ పై కమల్ హాసన్ కూడా ఒక సలహా ఇచ్చాడు. కేవలం అభిమానిగా మాత్రమే కాకుండా మెగాస్టార్ ట్రాక్ రికార్డును కూడా గుర్తు పెట్టుకొని ఇతర దర్శకులు చూపించని విధంగా మెగాస్టార్ ను చూపించాలి అనే వివరణ ఇచ్చాడు. మొత్తానికి వెంకీ కుడుముల అయితే మెగా స్టార్ తో సినిమా చేయబోతున్నట్లు ఒక వివరణ ఇవ్వడంతో మొన్నటి వరకు వచ్చిన వార్తలు అబద్ధాలు అని తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X