For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ కోసం బాలీవుడ్ భామ.. అదే అసలు ప్లాన్.. 'ఆమె'ను పక్కనపెట్టి మరీ!

  |

  దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. అతడు లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత వీరిద్దరూ కలిసి ఖలేజా అనే సినిమా చేశారు కానీ ఈ సినిమా అనుకున్నంత మేర అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిన్న విడుదలైంది. అయితే ఈ తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది వివరాల్లోకి వెళితే

  రాజమౌళితో అనుకుంటే త్రివిక్రమ్ తో

  రాజమౌళితో అనుకుంటే త్రివిక్రమ్ తో

  ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. నిజానికి సర్కారు వారి పాట సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ అనుకోని కారణాలతో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది.. నిజానికి ఈ సినిమా ప్రకటన మే 31వ తేదీ ఉంటుందని అందరూ భావించారు, కానీ అనూహ్యంగా నిన్న సాయంత్రం ప్రకటన వెలువడింది.

  ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో

  ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో

  అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ రాజమౌళితో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కారణంగా తమ కాంబినేషన్ సినిమా లేట్ అవుతుందేమో అని భావించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో సినిమా ఫైనల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తారక్ కూడా కొరటాల శివ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. అలా ఇప్పుడు మహేష్ - త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి చేస్తున్నారు.

  పూజా హెగ్డే హ్యాట్రిక్

  పూజా హెగ్డే హ్యాట్రిక్

  ఇక అజ్ఞాతవాసి తర్వాత అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో అనే రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలు హిట్ కొట్టాడు.. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఆ రెండు సినిమాల్లోనూ పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించడం. దీంతో మహేష్ బాబు సినిమాలో కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.. అయితే అది ప్రచారం వరకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు సరసన మరో హీరోయిన్ కోసం యూనిట్ వెతుకులాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

  ప్యాన్ ఇండియా ప్లాన్

  ప్యాన్ ఇండియా ప్లాన్

  ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపు అందరు బడా హీరోలు తమ తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రభాస్ ముందుగా పాన్ ఇండియా సినిమాలు తెలుగు హీరో లకు అలవాటు చేయగా ఇప్పుడు దాదాపు అందరూ అదే పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సినిమా కోసం ఒక బాలీవుడ్ భామను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు

  లోఫర్ భామ లైన్ లోకి

  లోఫర్ భామ లైన్ లోకి


  ఆ బాలీవుడ్ భామ మరెవరో కాదు దిశా పటాని అనే ప్రచారం కూడా మొదలయింది. లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె హీరోయిన్ గా చేసిన తాజా మూవీ రాధే కూడా ఈ నెల 13న రిలీజ్ కాబోతోంది. ఆ భామను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది అధికారిక ప్రకటన వెలువడితే కానీ చెప్పలేము.

  మహేష్ స్పందించలేదెందుకో

  మహేష్ స్పందించలేదెందుకో


  మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించి హారిక హాసిని సంస్థ నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సంస్థ తరపు నుంచి ప్రకటన వచ్చింది కానీ ఆ ప్రకటన గురించి మహేష్ బాబు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఇలా మూవీలు అనౌన్స్ చేసిన సమయంలో మహేష్ బాబు కనీసం దానిని రీట్వీట్ చేయడం లేకపోతే రి పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉండేవారు కానీ ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎక్కడా ఈ సినిమాకు సంబంధించిన ప్రస్తావన కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది.

  English summary
  Finally the official statement of the SSMB28 has came yesterday. Now fans are wondering about the female lead who’s pairing up with the super star. Actually some reports say pooja hegde finalised for lady lead role in movie. But the makers of the film are eyeing on The most happening actress in Bollywood, Disha Patani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X