Siddu Jonnalagadda: రేటు పెంచేసిన సిద్దు జొన్నలగడ్డ...టైర్ 2 హీరోల రేంజ్‌లో..ఒక్కో సినిమాకు ఎంతో తెలుసా?
సిద్దూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డీజే టిల్లు సినిమాకు ఎన్నో సినిమాలు చేశాడు. కానీ డీజే టిల్లు సినిమాతోనే ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్దూ. ఇక ప్రస్తుతం ఈ కుర్ర హీరో.. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమానే కాకుండా ఆయన చేతిలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి. అయితే డీజే టిల్లు ఇప్పుడు ఆమాంతం తన రేటును పెంచేశాడు. టైర్ 2 హీరోల రేంజులో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సిద్దూ జొన్నలగడ్డ... డీజే టిల్లు సినిమాకు ముందు... మా వింత గాథ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలు చేశాడు. ఇక ఈ సినిమాలు పర్వాలేదనిపించినా.... డిజె టిల్లుతో మాత్రం రీసౌండ్ వచ్చేలా హిట్టు కొట్టాడు. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఎక్కడ చూసినా టిల్లు పాటలు.. డైలాగులు హల్ చల్ చేశాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ అంటూ ఆ సినిమాకు సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్స్ ఆకట్టుకుంటున్నాయి.

యూత్ లో సిద్దుకి మంచి క్రేజ్ ఉంది. డీజే టిల్లు లాంటి సాలిడ్ హిట్ పడటం.. ఆ తర్వాత ఆయన డైలాగ్ డెలివరికి అంతా ఫీదా అయిపోయారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు సిద్దూ తన రెమ్యూనరేషన్ పెంచేశాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ రెమ్యూనరేషన్ ఇప్పుడు 10 కోట్లకు చేరిపోయిందని సమాచారం. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే..సిద్దు కెరీర్ ఎంత స్ట్రాంగ్ గా క్రియేట్ చేసుకున్నాడో తెలుస్తోంది.
ప్రస్తుతం సిద్దు చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికోసం సిద్దు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అయితే.. సిద్దు లెవెల్ హైగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక సిద్దు రెమ్యూనరేషన్ టైర్ 2 హీరోలను దాటిపోయిందని అంటున్నారు. నాని, శర్వానంద్ వంటి హీరోల రెమ్యూనరేషన్ తగ్గట్లు సిద్దూ కూడా పెంచేశాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

సిద్దూ తీస్తున్న సినిమాల్లో మరో రెండు హిట్స్ పడితే... టాప్ టాలీవుడ్ హీరోల్లో చేరిపోతాడు. ఇక అప్పుడు మరింత రెమ్యూనరేషన్ పెంచేసేలా ఉన్నాడు సిద్దు. రెండు సినిమాలు కూడా హిట్ అయితే ఇక సిద్ధూకు తిరుగులేదని అంటున్నారు. అవలీలగా స్టార్ గా ఎదిగిపోవడం ఖాయం అంటున్నారు. టైర్ 2 హీరోలను దాటి రెమ్యూనరేషన్ తీసుకోవడం.. సిద్ధూ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు.
ఇక ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ...టిల్లు స్క్వేర్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











