వరుసగా 29 సినిమాలు ఫ్లాప్.. అయినా 12 కోట్ల రెమ్యునరేషన్.. 300 కోట్ల ఆస్తి ఉన్న హీరో ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమలో రాణించాలంటే వారసత్వం, టాలెంట్ సరిపోవు. వీటికి తోడు అదృష్టం కూడా ఉండాలి. సినీ వారసత్వాన్ని స్వీకరించి ఇండస్ట్రీలోకి వచ్చిన వారు రాణించలేక కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. అలాగే టాలెంట్ ఉన్నప్పటికీ.. సరైన సినిమాలను, కథలను ఎంచుకోవడంలో విఫలమైన హీరోలు కనిపించకుండా పోయారు. అయితే అందం, టాలెంట్, లెజెండరీ వారసత్వం ఉన్న ఓ హీరో మాత్రం 29 ఫ్లాపులతో కెరీర్ కొనసాగిస్తున్న హీరో వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా పరిశ్రమలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి తెలియని వారుండరు. అలాంటి లెజెండరీ యాక్టర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వచ్చిన హీరో అభిషేక్ బచ్చన్. అయితే ప్రముఖ డైరెక్టర్ జేవీ దత్తా దర్శకత్వంలో రూపొందిన రెఫ్యూజీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా ద్వారా కరీనా కపూర్ తన కెరీర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రెఫ్యూజీ మూవీ తర్వాత అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ధాయి అక్షర్ ప్రేమ్ కే, తేరా జాదూ చల్ గయా, బస్ ఇత్నా సా క్వాబ్ హై, హ మైనే బీ ప్యార్ కియా, దేశ్, ఓం జై జగదీష్, శరారత్, మై ప్రేమ్ దీవానీ హు, ముంబై సే ఆయ మేరే దోస్త్, కుచ్ నా కహో, జమీన్ చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.
అభిషేక్ బచ్చన్ నటించిన రన్, యువ, ధూమ్, బంటీ ఔర్ బబ్ల, సర్కార్ లాంటి సినిమా మంచి పేరు తెచ్చినప్పటికీ.. బాక్సాఫీస్‌ను షేక్ చేయలేకపోయాయి. అయినా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకొనే పాత్రలను ఎంపిక చేసుకొంటున్నాడు. ఆరంభంలో వచ్చిన దాదాపు 29 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించలేకపోయాయి.
తాజాగా బిగ్ స్క్రీన్‌పై నటిస్తూనే ఓటీటీ, డిజిటల్ రంగంపై ఫోకస్ పెట్టారు. బ్రీత్: ఇంటూ ది షాడోస్, సన్స్ ఆఫ్ ది సాయిల్: జైపూర్ పింక్ పాంథర్, బిగ్ బుల్, దాస్వి, లాంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఘూమర్ చిత్రంలో నటించాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతున్నది.

ఇక అభిషేక్ బచ్చన్ సంపాదన విషయానికి వస్తే.. ప్రతీ నెల సుమారుగా 2 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రతీ సినిమాకు ఆయన 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తిని సుమారుగా 300 కోట్లుగా అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











