పీకల్లోతు అప్పులతో సూపర్‌స్టార్ దివాళా.. చదువు మానేసి షూటింగ్‌లో టీ బాయ్‌గా.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

సినీ పరిశ్రమలో ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడం క్షణాల్లో జరిగిపోతుంటాయి. ఈ రోజు సంపదతో రాజభోగాలు అనుభవించిన హీరోలు.. మరుసటి రోజు కల్లా బికారీగా మారిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకొనే హీరో, హీరోయిన్లు దివాళా తీసి రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో.. ఇండియాలో సూపర్‌స్టార్ ఉన్నట్టుండి.. బిజినెస్‌లో భారీగా నష్టాలు వచ్చి.. దివాళా దశకు చేరుకోవడంతో.. ఆయన కొడుకు షూటింగులో సెట్ బాయ్‌గా, ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సూపర్ స్టార్ ఎవరు? ఆయన కొడుకు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారనే వివరాల్లోకి వెళితే..

ఇండియాలో ఇంటి నుంచి థియేటర్లకు పరుగులు పెట్టించిన హీరో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా సంచలన విజయాలు సాధించి.. బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. తన సినిమా రిలీజ్ అయిందంటే.. దేశవ్యాప్తంగా థియేటర్లలో పండుగ వాతావరణం ఉండేది. అలాంటి హీరో ఆర్థికంగా తీవ్రమైన ఒడుదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Do You Know Abhishek Bachchan worked as Set Boy, Production Assistant while Amitabh Bachchan Insolvency stage?

తాను స్టార్ హీరోగా అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న సమయంలో అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ABCL)ను స్థాపించి సినీ నిర్మాణాలు, అందాల పోటీలు, ఇతర ఈవెంట్లను నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఆయన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడం.. అందాల పోటీలకు వ్యతిరేకంగా నిరసనలు రావడంతో ఆయన పరిస్థితి గందరగోళంగా మారింది. దాంతో వ్యాపారాల్లో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు.

ఓ దశలో అమితాబ్ తన ఆస్తులను అమ్మకానికి కూడా పెట్టాడు. అప్పులు తీర్చడానికి డబ్బులు లేని పరిస్థితి. ఉన్నట్టుండి అమితాబ్ లైఫ్ సందిగ్దంలో పడింది. ఆ సమయంలో అభిషేక్ కాలేజ్ విద్యనభ్యసిస్తున్నాడు. చదువు మానేసి.. సినిమా షూటింగులో సెట్ బాయ్‌గా ఛాయ్‌, కాఫీలు కూడా అందించాడు అని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

Do You Know Abhishek Bachchan worked as Set Boy, Production Assistant while Amitabh Bachchan Insolvency stage?

ఇక సినీ పరిశ్రమలో అభిషేక్ బచ్చన్ పనిచేయడం ప్రారంభించాడు. ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అమితాబ్ ప్రతికూల పరిస్థితుల నుంచి పైకి లేచాడు. కేబీసీతో పునర్ వైభవం అందుకొన్నాడు. వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ సమయంలోనే తేరుకొని అభిషేక్ బచ్చన్‌ను రెఫ్యూజీ సినిమాతో హీరోగా పరిచయం చేశాడు.

ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నెలకు సుమారుగా 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌తో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 1500 కోట్లకుపైగానే ఉన్నట్టు అధికారికంగా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X