12 డిజాస్టర్స్.. 10 సంవత్సరాలు ఒక్క హిట్ లేదు.. ఆ హీరో ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమలో హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా హీరోలుగా కొనసాగుతూనే ఉంటారు. సినిమా ఫ్లాఫయినా వారికి ఉండే క్రేజ్ మాత్రం తగ్గకపోగా.. మరింత క్రేజ్ పెరుగుతుంటుంది. అలాంటి హీరోలు సినిమా పరిశ్రమలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి కోవలో 10 సంవత్సరాలుగా హిట్ లేకపోయినా స్టార్ హీరోగా చెలామణిగా అవుతున్న హీరో ఎవరో మీరు చెప్పగలరా? ఆ హీరో వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో యువ హీరో ఆదిత్య రాయ్ కపూర్ బాలీవుడ్‌లోకి లండన్ డ్రీమ్స్ అనే సినిమా ద్వారా అడుగుపెట్టారు. 2009 సంవత్సరంలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్‌తో మొదలైన ప్రయాణం అంత గొప్పగా సాగలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత యాక్షన్ రిప్లే సినిమా కోసం అక్షయ్ కుమార్‌తో నటించారు. అలాగే హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్‌తో గుజారిష్ సినిమాలో నటించారు. కానీ ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.

అయితే ఆదిత్య రాయ్ కపూర్‌కు 2013 సంవత్సరంలో తొలి సక్సెస్ లభించింది. ఆయన నటించిన ఆషీకి 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం లభించింది. భారీ సక్సెస్‌తో 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన హీరోగా ఆయన ఓ రికార్డు క్రియేట్ చేసింది.
ఆషీకి 2 సినిమా తర్వాత మరోసారి మల్టీ స్టారర్ సినిమాలో కనిపించాడు. రణ్‌బీర్ కపూర్, దీపిక పదుకోన్‌తో కలిసి యే జవానీ హై దివానీ సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా హిట్ కావడంతో కొంత ఊరట లభించింది. కానీ ఆ విజయం ఆదిత్య ఖాతాలో పడకపోవడం గమనార్హం.
అయితే ఆ సినిమాల తర్వాత ఆదిత్య రాయ్ కపూర్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దావత్ ఏ ఇష్క్, ఓకే జాను, కళాంక్ లాంటి సినిమాలు, మలంగ్ చిత్రాలు ఘోర పరాజయం పొందాయి. దాంతో మొత్తానికి ఆదిత్య రాయ్ కపూర్ మళ్లీ సందిగ్ధంలో పడింది.

ఇక ఇటీవల వెబ్ సిరీస్‌లోకి ఆదిత్య రాయ్ కపూర్ అడుగుపెట్టారు. ఓటీటీ రంగంలో కూడా ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్‌లో ఆయనకు మంచి పేరు వచ్చింది.


Click it and Unblock the Notifications











