10 కోట్ల ఆఫర్ రిజెక్ట్ .. దటీజ్ అల్లు అర్జున్!

కొన్ని నిమిషాల యాడ్ లో నటిస్తే కోట్లాది రూపాయలు వచ్చే ఆఫర్ ను ఎవ్వరూ వదులుకోరు. కానీ అల్లు అర్జున్ ఏకంగా 10 కోట్ల విలువైన ఆఫర్ ను అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వదిలేశారట. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు అందుకే కదా ఆయనను ఐకాన్ స్టార్ అంటారు అంటూ ఆకాశనికెత్తేస్తున్నారు. మరి అల్లు అర్జున్ వదులుకున్న ఆ యాడ్ కథ ఏంటో ఓ లుక్కేద్దాం.

సిగరెట్ తాగడం, పొగాకు, మద్యం సేవించడం వంటివి కూల్‌గా ఉండే ఈ కొత్త తరంలో అల్లు అర్జున్ ఆరోగ్యానికి హాని కలిగించే, తన అభిమానులను తప్పుదారి పట్టించే బ్రాండ్ ప్రమోషన్‌లను తిరస్కరించడం ద్వారా బాధ్యతాయుతమైన సెలబ్రిటీ అని నిరూపించుకున్నాడు.

Do you know Allu Arjun rejected a multi crore brand promotion deal with a leading tobacco brand

అసలు విషయం ఏమిటంటే పుష్ప: ది రూల్ విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌కి పెరిగిన ఫాలోయింగ్ నేపథ్యంలో ఓ పొగాకు బ్రాండ్ కమర్షియల్ టీవి యాడ్ చేయమని బన్నీకి భారీ ఆఫర్ చేసింది. పుష్ప: ది రూల్‌లో పుష్ప రాజ్ ధూమపానం చేసిన లేదా పొగాకు నమిలిన ప్రతిసారీ తమ బ్రాండ్ లోగోను స్క్రీన్‌పై ప్రదర్శించాలని వారు ఆఫర్ చేశారు.

అయితే బన్నీ మాత్రం ఈ ఆఫర్‌ను మరో ఆలోచన లేకుండా తిరస్కరించాడు. ఒకవేళ తాను ఈ యాడ్ చేస్తే అది తన అభిమానులను, శ్రేయోభిలాషులను తప్పుదారి పట్టిస్తుందనే ఉద్దేశంతోనే ఆయన రిజెక్ట్ చేశారట. సదరు పొగాకు బ్రాండ్ 10 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఈ కమర్షియల్ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంతేకాదు ఆయన పలు పొగాకు, మద్యాన్ని ప్రచారం చేసే ప్రకటనలలో పాల్గొనడానికి కూడా నిరాకరించారు.

ఈరోజు ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం కారణంగా బన్నీ ఈ యాడ్ ను రిజెక్ట్ చేశాడు అన్న వార్త వైరల్ అవుతోంది. బన్నీ తన అభిమానులలో అవగాహన పెంచడానికి చెట్లను నాటడం, ఇతర పర్యావరణ అనుకూల పనులను చేయడం వంటి సామాజిక బాధ్యతాయుతమైన కార్యకలాపాలను మాత్రమే చేస్తూ వస్తున్నారు. మొత్తానికి తన బిరుదుకు తగ్గట్టుగా ఐకాన్ గా నిలుస్తున్నారు బన్నీ.

Do you know Allu Arjun rejected a multi crore brand promotion deal with a leading tobacco brand

ప్రతి సంవత్సరం పొగాకు హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ధూమపానం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలతో సహా అనేక ఆరోగ్య ప్రమాదాల బారిన పడతారు అనే విషయాన్ని గుర్తు చేయడానికే ఈ స్పెషల్ డేను సెలబ్రేట్ చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X