Balayya షాకింగ్ - బాలయ్య ఎన్టీఆర్ కాంబో ఇలా మిస్ అయిందా? ఫ్యాన్స్‌కు ఇది తెలిస్తే ఏమైపోతారో?
ఎన్టీఆర్ - బాలకృష్ణ ఈ రెండు పేర్లు వింటే నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. ఇక వారిద్దరు కలిసి ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల్లో ఉండే సందడే వేరు. మరి ఈ బాబాయి - అబ్బాయి కలిసి నటిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇలాంటి ఓ అపురూపమైన దృశ్యం కోసం ఎప్పటినుంచే ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తునే ఉంటారు. కానీ బాబాయ్- అబ్బాయి మాత్రం ఈ విషయాలను ప్రస్తుతానికి పట్టించుకోవడం లేదు. అయితే వీరిద్దరి కలిసి ఓ సినిమాలో నటించే సందర్భం వచ్చిందట. కానీ ఆ తర్వాత ఓ కారణం వల్ల ఆగిపోయిందట. ఆ కారణం ఏంటంటే?
జై బాలయ్య, జై ఎన్టీఆర్.. ఈ రెండు పేర్లు ఎప్పటికీ తెలుగు వారి గుండె చప్పుళ్లు అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నందమూరి అభిమానులకు రెండు కళ్ళు లాంటి వారు. ఎందుకంటే వీరిద్దరిది పెద్దాయన ఎన్టీఆర్ వారసత్వం కాబట్టి. కానీ ఏమైందో తెలీదు కానీ వీరిద్దకు కలిసి ఒకే వేదికను పంచుకోవడం చాలా అరుదుగా కనిపిస్తోంది.

అయితే వీరిద్దరి కలిసి కనిపిస్తే చూడాలి అని, కలిసి నటిస్తే చొక్కా కాలర్ ఎగరేసుకుని నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరి కాంబో సన్నివేశాలు ఉంటే చాలు ఫ్యాన్స్ అన్నం తినకుండానే కడుపు నింపుకుంటారు ఫ్యాన్స్. అయితే వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని అప్పట్లో పెద్ద ప్రచారమే సాగింది. అదే జనతా గ్యారేజ్ సినిమా.
అయితే ఈ చిత్రంలో బాలయ్య ఎందుకు నటించలేదో గతంలో ఓ సారి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ బాలయ్య కాంబోలో మూవీ అంటే అంచనాలు భారీ రేంజ్లో ఉంటాయి. ఈ కాంబోలో వచ్చే సినిమా అంటే వారిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో అనే ఎదురుచూస్తారు కానీ కథను పట్టించుకోరు. జనతా గ్యారేజ్ కథా బలం ఉన్న చిత్రం. అందుకే ఆ పాత్రకు బాలయ్య సెట్ అవ్వరని అనిపించింది. భవిష్యత్తులో ఏమైనా ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావొచ్చేమో చూద్దాం అని కొరటాల గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక బాలయ్య తర్వాత మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని తీసుకోవాలని కూడా అనుకున్నారట. కానీ అప్పుడు కూడా ఆయనకు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల మోహన్ లాల్‌ను తీసుకున్నారని తెలిసింది.

కాగా, బాలయ్య - తారక్ మధ్య ఏం జరిగిందో కానీ చాలా కాలంగా దూరంగా కనిపిస్తున్నారు. ఎప్పుడో ఓ సారి మాత్రమే వేదికను పంచుకుంటున్నారు. రాజకీయ కారణాలు ఇబ్బంది పెడుతున్నాయో లేదా వ్యక్తిగత విషయాలో కానీ దీనిపై స్పష్టత లేదు. కానీ ఏదీ ఏమనుకున్నా అబ్బాయి తారక్‌కు బాబాయ్ బాలయ్య అంటే చాలా అభిమానమని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు.


Click it and Unblock the Notifications











