బిగ్‌బాస్ తర్వాత పిలుపు మార్చిన శివాజి కూతురు.. డాడీకి బదులుగా అలా పిలుస్తోందట?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ అద్భుతమైన ఆట తీరుతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో రెండు గ్రూపుల మధ్య గొడవలు జరగడం, ఆ రెండు గ్రూపులకే ఎక్కువ ఫ్యాన్స్ రావడం అందరికీ తెలిసిందే. ఇందులో స్పై, స్పా బ్యాచ్ లు ఉన్నాయి. స్పా బ్యాచ్ ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభాశెట్టిలు ఉండగా.. స్పై బ్యాచ్ లో శివాజి, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లు ఉన్నారు. ఇందులో ఇంటికి పెద్ద వాడిగా శివాజి తన బాధ్యతలు చూసుకున్నాడు.
కాస్త వీక్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ తో పాటు, ప్రిన్స్ యావర్ లకు అండగా ఉంటూ అతను గేమ్ ఆడిన తీరు అందరికీ నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. 12వ వారం వరకు అంతా శివాజియే విన్నర్ గా నిలుస్తాడని భావించారు. కనీసం టాప్ 2లో నైనా ఉంటాడని గట్టిగా చెప్పారు. కానీ షో చివరకు వచ్చే సరిసి అంతా ఉల్టాపుల్టాగా మారిపోయింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా, అమర్ దీప్ రన్నరప్ గా నిలిచారు. అయితే దీనిపై శివాజి మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. కావాలనే తనను గెలవనివ్వలేదని.. కావాలనే లాస్ట్ రెండు వారాల్లో తనను బ్యాడ్ చేశారని కామెంట్లు చేశారు.

ఇదంతా ఎలా ఉన్నా శివాజికి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన అభిమానం పేరు, ప్రఖ్యాతలు అంతా ఇంతా కాదు. షో తర్వాతే ఈయన అంతకు ముందు నటించిన ఓ వెబ్ సిరీస్ విడుదల కావడంతో అంతా దాన్ని చూసి తృప్తి పడుతున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా బాగా కనెక్ట్ అయిందీ చిత్రం. నిజజీవితంలో లాగే శివాజికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చూపించడం.. ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నట్లు చూపించడంతో మరింతగా శివాజి క్యారెక్టర్ కు దగ్గరయ్యారు. ఆయన బిహేవియర్ కూడా అచ్చం అలాగే ఉండడం అందరినీ ఆకట్టుకుంది.
అయితే #90స్ వెబ్ సిరీస్ లో శివాజి పిల్లలుగా నటించిన వాళ్లకు ఆయన అంటే రియల్ లైఫ్ లోనూ చాలా ఇష్టమట. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో ఆయన కూతురుగా చేసిన అమ్మాయి.. చైల్డ్ ఆర్టిస్ట్ వాసంతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. శివాజి గురించి చాలా షాకింగ్ విషయాలు చెప్పింది. వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో శివాజి గారిని సార్ అని పిలిచే తాను.. అతి తక్కువ కాలంలోనే డాడీ అని పిలవడం అలవాటు చేసుకుందట. అయితే ఆయన బిగ్ బాస్ కు వెళ్లే వరకూ ఆలాగే పిలిచేదట.

కానీ శివాజి బిగ్ బాస్ తర్వాత నుంచి వచ్చాక ఫోన్ చేసినప్పుడు మాత్రం తాను వేరేలా పిలిచానని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన చూసిన ఆమె... శివాజి ఫోన్ చేసిన వెంటనే శివన్న అంటూ మాట్లాడిందట. బిగ్ బాస్ తర్వాత డాడీ, సార్ అని పిలవలేకపోతున్నానని.. శివన్న, శివన్న అనే అంటున్నానని.. చెప్పుకొచ్చింది. అమ్మాయిలు ఎలా ఉండాలో కూర్చోబెట్టి చెబుతారని.. ఆయన అంటే తనకు చాలా ఇష్టం అని వెల్లడించింది. మీరు కూడా ఓసారి ఈ ఇంటర్వ్యూ చూసేయండి.


Click it and Unblock the Notifications











