17 వరుస బ్లాక్‌బస్టర్లతో సంచలనం.. ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్.. ఆ సూపర్‌స్టార్ హీరో ఎవరో తెలుసా?
సినిమా పరిశ్రమలో తిరుగులేని విజయాలు అందించే హీరోలు తక్కువ మందే ఉంటారు. సక్సెస్ మీద సక్సెస్ కొట్టి అభిమానులను సంపాదించుకొనే సత్తా కొందరికే ఉంటుంది. అలాంటి అదృష్టాన్ని దక్కించుకొన్న హీరోలను చూస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్క పెట్టే హీరోలు అతి తక్కువ మంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలా వరుసగా 17 బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించి ఇండియాలోనే తొలి సూపర్ స్టార్‌గా మారిన హీరో గురించి తెలుసుకొందామా?
భారతీయ సినిమా పరిశ్రమలో 50, 60 దశకాల్లో ఒకరకమైన సినిమాలతో పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, దేవానంద్ లాంటి హీరోలు ప్రేక్షకులను ఆలరిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో వెండితెర మీదకు దూసుకొచ్చిన హీరో రాజేశ్ ఖాన్నా. అప్పటి వరకు కమర్షియల్, గ్లామర్‌కు ఆమడ దూరంలో ఉన్న సినిమాను కలర్‌ఫుల్‌గా మార్చాడు. తనదైన హావభావాలు, డ్యాన్సులతో బాలీవుడ్‌కు తొలి సూపర్ స్టార్‌గా అవతరించాడు.

రాజేష్ ఖన్నా కెరీర్ విషయానికి వస్తే.. 1966 సంవత్సరంలో అఖరీ ఖత్ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఔరత్, ఆరాధన, బంధన్, ది ట్రైన్, కటీ పతంగ్, ఆనంద్ సినిమాలతో చెలరేగిపోయాడు. అలా మొదలైన తొలితరం సూపర్ స్టార్ 2014 వరకు తన కెరీర్‌ను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగించారు. ఆయన నటించిన చివరి చిత్రం రియాసత్. ఆ చిత్రంలో మాఫియాడాన్‌గా కనిపించారు.
రాజేష్ ఖన్నా తన కెరీర్‌లో దుష్మన్, అమర్ ప్రేమ్, అనురాగ్, మేరే జీవన్ సాథీ, నమక్ హరామ్, హమ్ షకల్, ప్రేమ్ నగర్, అజ్నబీ లాంటి సక్సెస్ చిత్రాలను అందించారు. ఆ తర్వాత కుద్రత్, దర్ద్, సురాగ్, నసీబ్, ధరమ్ కాంటా, డిస్కో డ్యాన్సర్,ఆవాజ్, హమ్ దోనో సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

రాజేష్ ఖన్నా తన కెరీర్‌లో 1969 నుంచి 1973 వరకు వరుసగా 17 బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. 1970 నుంచి 1980 వరకు అత్యధికంగా పారితోషికం తీసుకొన్న హీరోగా చెలామణి అయ్యారు. అందులో 15 చిత్రాలు సోలో హీరోగా హిట్లు కొట్టారు. 2 చిత్రాలు మల్టీ స్టారర్ చిత్రాలతో విజయాలు సాధించారు.
హిందీ సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన రాజేష్ ఖాన్నాను ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. లైప్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. 10వ లోక్‌సభకు న్యూఢిల్లీ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 2012 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











