HBD Mahesh Babu: టాలీవుడ్ శ్రీమంతుడు సంపద ఎంత?.. మహేష్ బాబుకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?
సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా చిత్ర సీమను ఏలుతున్నారు. విభిన్న వ్యక్తిత్వం, మంచితనం విషయంలో మహేశ్ తన తండ్రికి ఏమాత్రం తీసిపోరు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, ఎన్నో అవార్డులు రివార్దులను సైతం అందుకున్నారు. ఒక్క పాన్ ఇండియా సినిమాలోనూ నటించుకున్నా.. నేషనల్ , ఇంటర్నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించడం మహేశ్ ఒక్కరికే చెల్లింది. ప్రిన్స్‌గా, సూపర్‌స్టార్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న మహేశ్ బాబు ఇవాళ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
బాలనటుడిగా 1979లో వచ్చిన నీడ సినిమాలో కనిపించిన మహేశ్ బాబు.. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రి కృష్ణతో కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అంటే మహేశ్ సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్లు. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, చదువుపై కాన్సన్‌ట్రేషన్ చేసిన ప్రిన్స్.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు ద్వారా పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు మహేశ్ కెరీర్‌కు బూస్టప్ అందించాయి.

యూఎస్ మార్కెట్‌లో మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన 10 చిత్రాలు కలిగిన హీరో సూపర్‌స్టార్ ఒక్కరే. ఆయన నటించిన ఆరు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. తన నటనకు గాను తొమ్మిది సార్లు నంది అవార్డులను అందుకున్నారు మహేశ్. ఈ తరంలో అత్యధిక నందులను కైవసం చేసుకున్న ఏకైక హీరో ప్రిన్సే. అలాగే ఐదు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్, నాలుగు సైమా అవార్డులు, మూడు సినీ మా అవార్డులు, ఒక ఐఫా ఉత్సవం అవార్డ్ ఆయనను వరించాయి.
సినిమాలే కాదు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ప్రకటనల ద్వారా రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు మహేశ్ బాబు. ఈ విషయంలో దక్షిణాదిలోని ఏ నటుడు కూడా ఆయన దరిదాపుల్లో లేరు. సంపాదించిన డబ్బును పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్‌మెన్‌గానూ హిట్ కొట్టారు మహేశ్. ఏఎంబీ సినిమాస్ పేరుతో పెద్ద ఎత్తున మల్టిప్లెక్స్ బిజినెస్‌లో దిగారు. హైదరాబాద్‌లో నెలకొల్పిన ఏఎంబీ సినిమాస్ భారతదేశంలోని అతిపెదద్ మల్లిప్లెక్స్‌లలో ఒకటిగా నిలవడంతో పాటు హైదరాబాద్‌లోని బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లలోనూ చోటు దక్కించుకుంది. ది హంబుల్ కో. పేరుతో వస్త్ర వ్యాపారం, తన భార్య నమ్రత పేరు మీద హైదరాబాద్‌లో రెస్టారెంట్ ప్రారంభించారు. అంతేకాదు.. జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో భారీ బడ్జెట్ సినిమాలను సైతం తెరకెక్కిస్తున్నారు.

మహేశ్ బాబు ఆస్తుల విలువ రూ.175 కోట్ల పైనే ఉంటుందని అంచనా. హైదరాబాద్‌లో ఆయన నివసించే ఇంటి విలువ రూ.30 కోట్ల పైమాటే. అలాగే రూ.7 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్, లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక్కో సినిమాకు రూ.60 నుంచి రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే మహేశ్ బాబు .. భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగానూ, 2012లో భారతదేశంలో 100 మంది సెలబ్రెటీలలో ఒకరిగా ఫోర్బ్స్ లిస్టులో నిలిచారు.
సంపాదించడమే కాదు, దానదర్మాల విషయంలోనూ ముందుంటున్నారు. ప్రతి ఏటా తన సంపాదనలో నుంచి రూ.25 నుంచి రూ.30 కోట్లను దాన ధర్మాలకు వెచ్చిస్తున్నారు. తన తండ్రి పుట్టిన ఊరైన ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వేల మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు. మహేశ్ బాబు మరిన్ని విజయాలు అందుకుని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది Filmibeat.


Click it and Unblock the Notifications











