20 సినిమాల్లో నటిస్తే 19 డిజాస్టర్లు.. 13 ఏళ్లలో 1 హిట్ సినిమా.. ఆ సూపర్ స్టార్ కొడుకు ఎవరో తెలుసా?

సినీ పరిశ్రమలో వారసత్వం ద్వారా హీరోగా మారి రాణించాలంటే టాలెంట్ తప్పనిసరి. తండ్రి, తల్లికి ఉన్న పాపులారిటితో అట్టహాసంగా హీరోగా మారి టపా కట్టేసిన హీరోలు చాలానే ఉన్నారు. బాలీవుడ్‌లో 80వ దశకంలో అత్యంత పాపులారిటీ ఉన్న సూపర్ స్టార్ కొడుకుగా హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించి.. హీరోగా నిలబడేందుకు తంటాలు పడిన నటుడి గురించిన కథలోకి వెళితే..

బాలీవుడ్‌లో షో మ్యాన్‌గా పేరున్న హీరోల్లో ఫిరోజ్ ఖాన్ ఒకరు. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడం.. దర్శకత్వం వహించిన సినిమాలు బాక్పాఫీస్ వద్ద భారీ హిట్లుగా నిలిచాయి. శ్రీదేవీతో కలిసి నటించిన జాన్‌బాజ్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఖుర్బానీ, ధర్మాత్మ, దయావన్, యల్ గార్, వెల్‌కమ్ సినిమాలు మంచి పాపులారిటీ ఉన్న చిత్రాలుగా నిలిచాయి.

Do You Know Fardeen Khan have only 1 hit out of 26 movies in 13 years career?

అలాంటి దర్శక, నిర్మాత , నటుడిగా పేరున్న ఫిరోజ్ ఖాన్ వారసత్వం పుచ్చుకొని ఫర్దీన్ ఖాన్ బాలీవుడ్‌లోకి హీరోగా ప్రవేశించాడు. 1998 సంవత్సరంలో ప్రేమ్ ఆగన్ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. కానీ ఆ సినిమాతో అంతగా పేరు రాకపోయినా.. అందంగా ఉండటం, పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే సంపాదించుకొన్నారు.

అయితే తొలి చిత్రం మిక్స్‌డ్ టాక్ సంపాదించుకొన్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వరుసగా మూడు సినిమాల్లో ఫర్దీన్ ఖాన్ నటించాడు. జంగిల్, ప్యార్ తూనే క్యా కియా, లవ్ కే లియే కుచ్‌ బీ కరేగా సినిమాల్లో నటించాడు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాలు కూడా భారీగా బోల్తా కొట్టాయి. అలా ఆయన కెరీర్ వరుస ఫ్లాపులతో చితికిపోయింది.

ఫర్గీన్ ఖాన్ నటించిన ఓ జై జగదీష్, భూత్, జానాషీన్, దేవ్, షాదీ నంబర్ 1, ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా, ప్యారే మోమన్, ఆర్యన్, జస్ట్ మ్యారీడ్ లాంటి సినిమాల్లో నటించినా.. హీరోగా అతడి స్టేటస్‌ను నిలబెట్టలేకపోయాయి. దాంతో ఆయన మద్యానికి వ్యసనపరుడిగా మారారు. దాంతో 100 కిలోలకుపైగా బరువ పెరిగి.. లావై పోయాడు. దాదాపు 10 ఏళ్లకుపైగా అంటే 20210 నుంచి 2023 వరకు బాలీవుడ్‌ దూరంగా ఉన్నాడు.

Do You Know Fardeen Khan have only 1 hit out of 26 movies in 13 years career?

ఫర్దీన్ ఖాన్ ఇప్పటి వరకు 26 చిత్రాల్లో నటించాడు. సోలోగా నటించిన 20 చిత్రాల్లో 19 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా పరాజయం పొందాయి. గత 12 ఏళ్లలో ఆయన నటించిన ఒక సినిమా హిట్‌గా నిలిచింది. కేవలం అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, విద్యా బాలన్‌తో కలిసి నటించిన హే బేబీ భారీ విజయాన్ని అందుకొన్నది. 30 కోట్లు బడ్జెట్‌తో రూపొందించిన సినిమా 85 కోట్లు వసూలు చేసింది.

దాదాపు 12 ఏళ్ల తర్వాత ఫర్దీన్ ఖాన్ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వెనిజుల్లాలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ రాక్, పేపర్, సీజర్స్ సినిమాను రీమేక్‌గా విస్‌ఫాట్ అనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కుకీ గులాటీ దర్శకత్వంలో సంజయ్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి ఫర్దీన్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఆయన జాతకాన్ని మార్చుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X