Ram Charan రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్... వాటిలో హిట్స్ ఎన్ని? ఫ్లాఫ్స్ ఎన్నంటే?

టాలీవుడ్ లోకి చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ మూవీతో మొదలైన పాన్ ఇండియా క్రేజ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు చెర్రీ. ఈనెల కెరీర్లో చెర్రీ సినిమాల విషయంలో కొన్ని మంచి డెసిషన్ తీసుకుంటే, ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ తెలిస్తే కొన్నింటిని వదులుకొని తప్పు చేశాడా అనిపించక మానదు అభిమానులకు. ఈ సందర్భంగా చెర్రీ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ను చూసేద్దాం.

1. గౌతమ్ తిన్ననూరితో ప్రాజెక్ట్
ఆర్ఆర్ఆర్ మూవీ భారీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీని జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చేయాల్సి ఉంది. కానీ తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. నిజానికి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మాస్ అప్పీల్ ఉన్న భారీ సబ్జెక్ట్ కోసం వెతుకుతున్నాడని, అందుకే గౌతమ్ తిన్ననూరిని పక్కన పెట్టాడని ప్రచారం జరిగింది. ఇక అదే స్టోరీతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండను మెప్పించాడని, VD12 పేరుతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది అనే రూమర్లు మొదలయ్యాయి. కానీ గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కు వివరించిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ డ్రామా అని, VD12 చెర్రీ ప్రాజెక్ట్ సేమ్ కాదని అంటున్నారు.

Do you Know How many Movies Ram Charan rejected in his career Here is Top 5 Movies list

2. సూర్య సన్నాఫ్ కృష్ణన్
ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ తమిళం అయినప్పటికీ తెలుగులోనే కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. కానీ సూర్య కంటే ముందుగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ స్టోరీ రామ్ చరణ్ దగ్గరికి వచ్చిందట. ఆయన అదే సమయంలో రాజమౌళితో మగధీర అనే మూవీకి డేట్స్ కేటాయించడంతో ఈ మూవీని రిజెక్ట్ చేశాడట. అయితే ఇక్కడ మాత్రం చెర్రీ తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పొచ్చు. మగధీర మూవీ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లలో ఒక మూవీగా నిలిచింది.

Do you Know How many Movies Ram Charan rejected in his career Here is Top 5 Movies list

3. ఓకే బంగారం
డైరెక్టర్ మణిరత్నం ముందుగా ఓకే బంగారం మూవీని చెర్రీకి ఆఫర్ చేశాడట. కానీ అప్పుడు రామ్ చరణ్ వేరే మూవీతో బిజీగా ఉండడం వల్ల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత సీన్లోకి దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇవ్వడం, ఆయన సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించడం చకచకా జరిగిపోయాయి. ఇక స్క్రీన్ పై వీళ్ళిద్దరి జంట ఓకే బంగారం మూవీతో చేసిన మ్యాజిక్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

Do you Know How many Movies Ram Charan rejected in his career Here is Top 5 Movies list
4. ఏజెంట్
రామ్ చరణ్ తన కెరీర్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ధృవ మూవీతో చెర్రీకి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి మళ్ళీ ఆయనతోనే ఓ మూవీ తీయాలనుకున్నారు. అదే ఏజెంట్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత హఠాత్తుగా చెర్రీ సైడ్ అయ్యి, అఖిల్ అక్కినేని తెరపైకి వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా మారింది. దీంతో ఏజెంట్ మూవీని రిజెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ను జస్ట్ మిస్ చేసుకున్నాడు చెర్రీ.
Do you Know How many Movies Ram Charan rejected in his career Here is Top 5 Movies list

5. ఎటో వెళ్లిపోయింది మనసు
2008లో రిలీజ్ అయిన ఎటో వెళ్లిపోయింది మనసు మూవీలో నేచురల్ స్టార్ నాని, సమంత జంటగా నటించిన విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేదు. ఈ మూవీని ముందుగా రామ్ చరణ్ తో చేయాలనుకున్నారట డైరెక్టర్ గౌతమ్ మీనన్. కానీ చెర్రీ అప్పటికే ఆరంజ్ మూవీతో బిజీగా ఉండడంతో దీనిపై ఆసక్తిని చూపించలేదట. కానీ ఆరెంజ్ కంటే ఎటో వెళ్లిపోయింది మనసు మూవీ రిజల్టే బెటర్ గా వచ్చింది. ఇక అంతకంటే ముందే వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా మిస్ అయిన విషయం తెలిసిందే.

Do you Know How many Movies Ram Charan rejected in his career Here is Top 5 Movies list

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X