Vijayakanth Passed Away: పోలీస్ ఆఫీసర్‌గా విజయ్‌కాంత్ ప్రభంజనం.. ఎన్ని సినిమాల్లో ఖాకీ డ్రెస్ వేశాడో తెలుసా?

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ గురించి అందరికీ తెలిసిందే. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈయనకు కరోనా రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈక్రమంలోనే ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. విజయ్ కాంత్ మృతి విషయం తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు డీఎండీకే శ్రేణులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ద్విపాత్రాభినయంతో పాటు అనేక సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా ప్రభంజనం సృష్టించాడు. అయితే ఆ చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కెప్టెన్ విజయ్ కాంత్ తమిళలంలో 150కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1979లో తొలిసారి ఇనిక్కుం ఇలామై సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. దాదాపు 50 సంవత్సరాల పాటు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన ఈయన అనేక చిత్రాల్లో ద్విపాత్రాభినయం పోషించారు. డబుల్ యాక్షన్ అన్నా, అనేక యాక్షన్ చిత్రాల్లో నటించి మెప్పించిన అతి తక్కువ మంది హీరోల్లో విజయ్ కాంత్ కూడా ఒకరు. డబుల్ యాక్షన్ తో ఏదైనా సినిమా తీయాలని భావించిన డైరెక్టర్లు ముందుగా విజయ్ కాంత్ నే కలిసేవారట. 1980, 1990 సంవత్సరాల్లో అయితే పోలీసు ఆఫీసర్ గా చేయాలన్నా, డబుల్ యాక్షన్ చేయాలన్నా ఈయనే అనేంతగా గుర్తింపు సాధించారు.

Recommended Video

Vijayakanth ప్రస్థానం.. ఆ విషయంలో Captain ఒక్కడే మొదటి ఛాయిస్ | Telugu Filmibeat

Do You Know How Many Movies Vijaya kanth Has Appeared as a Cop

ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్టింగ్ ఇరగదీసే ఈయనకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపుగా 20కి పైగా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించినారు విజయ్ కాంత్. ఆ కాలంలో అతి ఎక్కువ సార్లు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఖాకీ దుస్తులు ధరించిన నటుల్లో ఈయనే నెంబర్ వన్. అయితే విజయ్ కాంత్ ఏయే సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడంటే... పులన్ విసరనై, చత్రియాన్, కెప్టెన్ ప్రభాకరన్, మానగార కావల్, థాయ్ మోజి, రాజదురై, సేతుపతి ఐపీఎస్, హానెస్ట్ రాజ్, అలెగ్జాండర్, వీరం విలంజ మన్ను, వల్లరసు, వాంచినాతన్, నరసింహ, దేవన్, ఎంగల్ అన్న, రెరరసు, అరసంఘం, విరుధగిరి వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కూడా ఆయన ఖాకీ డ్రెస్ లో కనిపించి అదరగొట్టాడు.

Do You Know How Many Movies Vijaya kanth Has Appeared as a Cop

గతంలో విజయ్ కాంత్ పురుట్చి కలైంజర్ అనే సినిమా తీయగా.. తమిళులు అంతా ఆయన్ను విప్లవ కారుడు అని పిలుచుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ ప్రభాకరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టగా... విజయ్ కాంత్ ను కెప్టెన్ విజయ్ కాంత్ చేశారు. సినిమాల వల్ల గుర్తింపుతో పాటు సినిమా పేరే తన పేరుగా వచ్చేసిందీ హీరోకు. కెరియర్ ప్రారంభంలో విలన్ గా చేసిన ఈయనకు అనేక ఫ్లాపులు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం సక్సెస్ ఫుల్ హీరోగా మారిపోయారు. 2015 వరకు విజయ్ కాంత్ హీరోగా చేశారు. ఆయన చివరగా సప్తగం అనే సినిమాలో నటించి మెప్పించారు. అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించిన ఈయన కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా గెలిచారు. ముఖ్యంగా ఈయన దర్శకత్వం వహించింది ఒకే ఒక్క సినిమాకు. అది కూడా విరుధగిరి అనే సినిమాకు. కొడుకును హీరోగా పెట్టి కూడా ఈయన ఓ సినిమా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X