పవన్ కల్యాణ్ ఎంత ట్యాక్స్ కట్టారు? ఎంత దానం చేశారు? ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయంటే?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నిక కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన జనసైనికులు, మిత్ర పక్షాల కార్యకర్తలు భారీగా తరలి వచ్చి నీరాజనం పడుతుండగా పవిత్ర పిఠాపురంలో అంగరంగ వైభవంగా నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషన్‌కు విధిగా సమర్పించాల్సిన అఫిడవిట్‌లో చాలా విషయాలు స్పష్టంగా తెలియజేశారు. ఆయన తెలియజేసిన కొన్ని వివరాల్లోకి వెళితే..
పవన్ కల్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికార ప్రభుత్వం మొత్తం 8 క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. ముఖ్యంగా ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా ఉద్రేకపూర్వకంగా ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై ఈ కేసులు నమోదు అయ్యాయనేది తాజా సమాచారం. గత ఏడాదిన్నర కాలంలో ఆయనపై ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇక గత ఏడాది కాలంలో తన ఆదాయాన్ని కోట్ల రూపాయలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు సుమారుగా 74 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, ఆదాయపు పన్ను శాఖకు పన్ను రూపంలో చెల్లించినట్టు చూపించారు. తన ఆదాయమంతా సినీ పరిశ్రమ నుంచే వచ్చినట్టు పేర్కొన్నట్టు సమాచారం.
ఇక గత ఐదేళ్ల కాలంలో భారీగా విరాళాలు ఇచ్చినట్టు తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కౌలు రౌతులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర బాధితుల కోసం కోట్ల రూపాయలు దానం చేసిన విషయం తెలిసిందే. ఆయన మొత్తంగా 20 కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో ఇచ్చాను అని ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన పత్రంలో పొందుపరిచారు.

పవన్ కల్యాణ్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆస్తులు, అప్పుల వివరాల ప్రకారం.. ఆయనకు 164 కోట్ల ఆస్తులు, 65 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నట్టు ప్రకటించారు. గత 5 సంవత్సరాల్లో 191 శాతం మేరకు సంపదకు సంబంధించిన వృద్ది జరిగిందనే విషయం అఫిడవిట్‌లో స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











