Prabhas: ప్రభాస్ భోజన ప్రియుడే... ఒక్క రోజుకు ఖర్చు అన్ని లక్షలా?
రెబల్ స్టార్ ప్రభాస్... ప్రస్తుతం సలార్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్.. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఒక్క రోజుకు అయ్యే ఫుడ్ ఖర్చు వివరాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఒక్క రోజుకు ఫుడ్ కోసం లక్షల్లో ఖర్చు పెడతారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
Recommended Video

ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. రాజుల కుటుంబం.. ఇక వీరి మర్యాదలు వేరే లెవెల్ అని తెలిసిందే. ముందు నుంచి ప్రభాస్ ఇంటికి ఎవరు వచ్చిన వారికి ఫుడ్ పెట్టి పంపిస్తారు వీరి కుటుంబ సభ్యులు. వద్దన్నా మరీ.. అన్ని వెరైటీలు చేసి మరీ తినిపిస్తారు. ప్రభాస్ తో పని చేసేవారు చాలా మంది ప్రభాస్ అతిథ్యం గురించి చెప్పుకువచ్చిన సందర్భాలు ఉన్నాయి.

ప్రభాస్ తో పనిచేసిన చాలామంది హీరోయిన్లు, కో యాక్టర్స్.. ప్రభాస్ ఆతిథ్యం తీసుకుని.. ఆనందపడిపోయేవారు. అయితే తాజాగా ప్రభాస్.. ఫుడ్ కోసం ఒక్కరోజులో ఎంత ఖర్చు చేస్తాడో తెలుసా? అంటూ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆయన ఫుడ్ కోసం.. ఏకంగా లక్షలు ఖర్చు చేస్తారు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.
ప్రభాస్ మంచి భోజనప్రియుడనే విషయం చాలా మందికి తెలుసు. ఎంత భోజన ప్రియుడు అయినప్పటికీ.. ఆయన సినిమాల విషయంలో డైట్ ఫాలో అవుతూ.. కరెక్ట్ బాడీనీ మెయిన్ టెయిన్ చేస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ ఇంట్లో లేదా షూటింగ్‌లో బోలెడన్ని వెరైటీ వెజ్-నాన్ వెజ్ వంటకాలు ఉండాల్సిందేనని తెలుస్తోంది.
ప్రభాస్ ఎప్పుడూ ఒంటరిగా తినడంట. ఆయతో పాటు... 10-20 మందితో కచ్చితంగా కలిసి తినాల్సిందేనని తెలుస్తోంది. కొన్నికొన్నిసార్లు సెట్ లో ఉన్నవాళ్లందరికీ కూడా ప్రభాస్ ఇంటి నుంచి భోజనాలు వస్తుంటాయని తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్.. వంటల్లో వెరైటీలతో ఎలా మొహమాట పెట్టేశాడో.. రాజమౌళి దగ్గర నుంచి పూజాహెగ్డే, శ్రద్ధాదాస్, కృతిసనన్, కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు చెప్పుకువచ్చారు.

మొన్నటి 'సలార్'లో చేసిన పృథ్వీరాజ్ కూడా ప్రభాస్ గురించి చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇన్ స్టాలోనూ ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ ఫొటోల్ని కూడా పోస్ట్ చేశారు చాలా మంది సెలబ్రెటీలు. ఇలా భోజనంపై విపరీతమైన ప్రేమ ప్రభాస్ కోసం.. స్పెషల్‌గా ఓ కుకింగ్ టీమే ఉందని తెలుస్తోంది. వీళ్లు ఓ రోజులో ప్రిపేర్ చేసి ఫుడ్ విలువ దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఎంత రూమర్ అయినా సరే ఇది ఆల్మోస్ట్ నిజమే కావొచ్చని తెలుస్తోంది.
అలా ప్రభాస్ రెండు లక్షల రూపాయలను ఫుడ్ కోసం ఖర్చు చేస్తారని తెలుస్తోంది. ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ నటించిన సలార్.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో వచ్చిన ప్రభాస్.. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు సలార్ తో రాగా.. బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











