రామాయణం లాభాల్లో యష్ వాటా ఎంతో తెలుసా?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న 'రామాయణం' చిత్రానికి యష్ నిర్మాత అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనుండగా, యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్రను ఒప్పుకోవడంతో పాటు నిర్మాత కూడా కావడంతో ఆయన ఈ మూవీ లాభాల్లో వాటా కూడా దక్కుతుంది. మరి యష్‌కి ఈ సినిమా లాభంలో వాటా ఎలా వస్తుంది అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

800 కోట్లకు పైగా బడ్జెట్‌తో 'రామాయణం' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానప్పటికీ రోజుకో రూమర్ మాత్రం చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రామాయణం మూవీకి సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్స్ లీక్ అయ్యాయన్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ సెట్ లో స్ట్రాంగ్ రూల్స్ పెట్టారు.

Do you know how much profit Yash will get by Ramayana Movie

షూటింగ్ సెట్ లో అనవసరమైన వ్యక్తులు ఉండకూడదు, ఫోన్లు తీసుకురాకూడదు అంటూ డైరెక్టర్ నితీష్ చిత్రబృందానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడానికి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు యష్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడంతో ఆయనకు వచ్చే ప్రాఫిట్ గురించి చర్చ నడుస్తోంది.

తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాకు వచ్చే లాభాల్లో 20-30 శాతం లాభం యష్‌కి దక్కుతుందని తెలుస్తోంది. అంటే ఆయన పెట్టుబడి కూడా ఇదే స్థాయిలో ఉండటం ఖాయం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు . కానీ అసలు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? అనే విషయంపై ఇప్పటిదాకా యష్ ఎక్కడా వెల్లడించలేదు.

ఏప్రిల్‌లో యష్ 'రామాయణం' గురించి మాట్లాడాడు. కానీ సినిమాలో తన పాత్ర గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. అయితే తాను సినిమా నిర్మాణంలోకి ఎందుకు వచ్చాడో మాత్రం వివరించాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అందుకే ఈ సినిమాను చేసి అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించి భారత్ కీర్తిని మరింతగా పెంచాలని నిర్ణయించుకున్నాడు.

యష్ రావణుడిగా అభిమానులు ఎలా ఉంటారో చూడాలనే ఆసక్తి చాలామందిలో ఉంది. 835 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 'రామాయణం' తెరకెక్కనుంది. దీని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి 600 రోజులు పడుతుందని అంటున్నారు. గ్లోబల్ లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.

సాయి పల్లవి సీతగా, అరుణ్ గోవిల్‌ దశరధుడిగా, లారా దత్ కైకేయిగా కనిపించనున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్‌ నటిస్తున్నారు. ఈ సినిమా సెట్ కు సంబంధించిన ఫోటో ఇప్పటికే వైరల్‌గా మారింది.

More from Filmibeat

Read more about: yash ramayana bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X