ఇండియన్ 2 మూవీకి కమల్ పారితోషికం 75 కోట్లు.. indian సినిమాకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
దాదాపు 28 ఏళ్ల తర్వాత సేనాపతి థియేటర్లలోకి తిరిగి రాబోతున్నారు. జూలై 12న ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే ఇండియన్ 2 మూవీ కోసం కమల్ హాసన్ దాదాపు 150 కోట్ల పారితోషకం అందుకున్నారని రూమర్లు వైరల్ అవుతున్నాయి. మరి ఫస్ట్ పార్ట్ ఇండియన్ కోసం కమల్ ఎంత పారితోషకం అందుకున్నారో తెలుసా? ఆ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
తమిళ చిత్ర సీమలో గొప్ప విజనరీ దర్శకుడిగా అభిమానుల మనసులో స్థానం దక్కించుకున్న దర్శకుడు శంకర్. ఆయన కెరీర్లో మూడో చిత్రంగా తెరకెక్కిన మూవీ భారతీయుడు. తండ్రి, కొడుకులుగా కమల్ హాసన్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో కమల్ హాసన్ స్వాతంత్ర పోరాట యోధుడిగా, అవినీతిపరులను అంతం చేసే సేనాపతిగా నటించి ప్రేక్షకులకు మర్చిపోలేని ట్రీట్ ఇచ్చారు.

కమల్ హాసన్ నటన కౌశలానికి పట్టం కట్టేలా ఎన్నో సినిమాలు ఇప్పటి దాకా రిలీజ్ అయినప్పటికీ, ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా మర్చిపోలేని సినిమాల్లో భారతీయుడు ఒకటిగా నిలిచింది. ఫస్ట్ పార్ట్ కి ఏఆర్ రెహమాన్ సంగీతం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 1990వ దశకంలో ఇండియాలో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ డెవలప్మెంట్ కాలేదని చెప్పాలి. అయినప్పటికీ భారతీయుడు సినిమా గ్రాఫిక్స్ సీన్స్ ని అద్భుతంగా మెయింటైన్ చేశారు.
భారతీయుడు సినిమాకు లభించిన విశేష ఆదరణ, సక్సెస్ సెకండ్ పార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. చాలాకాలం నుంచి భారతీయుడు 2 మూవీ కోసం కమల్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. భారతీయుడు సినిమా గ్రాఫిక్స్ సీన్స్ ని రియల్ ఎస్టేట్ గా చూపించిన ఘనత శంకర్ కే దక్కింది. అయితే సెకండ్ పార్ట్ కోసం కోట్లు ఖర్చు చేసి ప్రతి సీన్ ని మరింత విజువల్ వండర్ గా తెరకెక్కించారు.

ఈ నేపథ్యంలోనే భారతీయుడు 2 సినిమాలో నటించడానికి కమల్ హాసన్ 75 కోట్లు పారితోషం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్ భారతీయుడు 25 ఏళ్ల క్రితం రిలీజ్ కావడంతో అందులో నటించడానికి ఆయన అప్పట్లో ఎంత మొత్తాన్ని అందుకున్నారు అనే విషయానికి వస్..అప్పట్లో కోటి రూపాయలకు పైగా పారితోషికంగా తీసుకొన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతాయి. 1988 టైంలో రజిని కమల్ లాంటి స్టార్స్ భారీగా లక్షలు పారితోషంగా తీసుకుంటున్నారు. అయితే 1990 నుంచి 2000 వరకు ఈ హీరోల రెమ్యూనరేషన్ అమాంతం పెరిగి 3 కోట్ల వరకు చేరుకుంది.
కమల్ హాసన్ ఇండియన్ సినిమా 1996లో రిలీజ్ అయింది. అప్పట్లో ఆయన పారితోషకం 1.5 కోట్లు కాగా, ఈ సినిమా మొత్తం బడ్జెట్ 15 కోట్లు కావడం గమనార్హం. కాగా ఇప్పుడు జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ మేకర్స్ మాత్రం మూవీ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో టికెట్ల రేట్ల వివాదం నడుస్తోంది. మరి భారతీయుడు 2కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











